ఒకపక్క ఇంట్లో నాన్న శవం.. అయినా క్రీజులో కోహ్లీ!

Virat Kohli father history

11:42 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Virat Kohli father history

విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ను ఊపేస్తున్న ఆటగాడు. సచిన్ తర్వాత అంతటి గొప్ప బ్యాట్స్ మెన్ ఎవరంటే టక్కున విరాట్ కోహ్లీ పేరే చెప్తారు. చిన్నపిల్లలు నుండి పెద్ద వాళ్ళ దాకా విరాట్ ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. విరాట్ క్రీజులో ఉన్నాడంటే మనకు ఇక తిరుగులేదనే నమ్మకం. ప్రస్తుతం అతనికి ఉన్న స్టార్డం ప్రపంచంలో ఏ క్రికెటర్ కూ లేదు. ఇప్పుడు అతని బ్రాండింగ్ విలువే 100 కోట్లు అంటే మీరు నమ్మరేమో. 27 ఏళ్ల కోహ్లీ ప్రస్తుతం అనుభవిస్తున్న స్టార్డం అంత ఈజీగా వచ్చింది ఏమి కాదు.. ఎన్నో ఏళ్ల కష్టఫలం, ఎంతో కృషి చేస్తే ఆ స్ధాయికి వచ్చాడు.. విరాట్ కోహ్లీకి తన తండ్రి 'ప్రేమ్ కోహ్లీ' అంటే ఎంతో ఇష్టం.

ఇది కూడా చదవండి: పబ్లిక్ లో ఫ్యాన్ తో అక్కడ చెయ్యి వేయించుకున్న సన్నీ!

ఆయనకు విరాట్ ను భారత జట్టు ఆటగాడిగా చూడాలని కోరిక. 2006 డిసెంబర్ లో విరాట్ అప్పుడప్పుడే రంజీ క్రికెట్ లో ఢిల్లీ తరుపున నైట్ వాచ్ మన్ గా ఆడుతున్నాడు. అలాంటిది తెల్లవారుజామున 3 గంటలకు అతని తండ్రి చనిపోయాడని వార్త విన్నాడు. అంత్యక్రియలకు హాజరుకమ్మని ఫోన్స్. వేరే ఆటగాళ్ళు అయితే వేరే ఏదో చేసేవారేమో కానీ కోహ్లీ మాత్రం తన తండ్రి ఆశయాన్ని నిజం చేయడానికి బ్యాటింగ్ కు దిగి 90 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు అదీ కూడా అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల. అలా తమ టీమ్ ను ఫాలో ఆన్ నుండి గట్టెక్కించాడు కోహ్లీ. ఆ సంఘటన తెలిసిన ప్రతి ఒక్క ఆటగాడు కోహ్లీ చూపించిన తెగువకు అభిమానులయ్యారు.

ఇది కూడా చదవండి: సీక్రెట్ ప్లేసులో 'ఓం' టాటూ వేయించుకున్న పాప్ సింగర్!

ఆ వెంటనే కోహ్లీ తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. కోహ్లీ తండ్రి మరణించినప్పుడు కోహ్లీ వయసు ‘18’. అందుకే తన పద్దెనిమిదోవ ఏట తండ్రి మరణించాడని గుర్తుగా కోహ్లీ ఎప్పుడూ ‘18’ నంబర్ జర్సీ నే ధరిస్తుంటాడు. క్రికెట్ అంటే అంత ప్యాషన్ ఉండబట్టే కొహ్లీ నేడు దేశంలోనే పాపులర్ ఆటగాడయ్యాడు. ప్రస్తుతం క్రికెట్ కాకుండా యాడ్స్ రూపంలో అత్యధికంగా 150 కోట్లకు పైగా సంపాదిస్తున్న ఏకైక క్రికెటర్ కోహ్లీ.

ఇది కూడా చదవండి: ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం!

English summary

Virat Kohli father history. When Virat Kohli was 18 his father was expired. At that time he was playing a match as a night watchmen.