అనుష్కకు ముద్దిచ్చి సెండాఫ్ చెప్పిన కోహ్లీ

Virat Kohli gave kiss to Anushka Sharma

10:39 AM ON 4th June, 2016 By Mirchi Vilas

Virat Kohli gave kiss to Anushka Sharma

క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల ప్రేమ తిరిగి గాడిలో పడిందా అంటే అవుననే విధంగా పరిస్థితులు వున్నాయి. 'సుల్తాన్' సినిమా షూటింగ్ కోసం బుడాపెస్ట్ వెళ్లిన అనుష్కాకు, కోహ్లీ గ్రాండ్‌గా సెండాఫ్ చెప్పాడు. తన కారులో అనుష్కను ఎయిర్‌పోర్టు వరకు డ్రాప్ చేశాడు. అక్కడ వారిద్దరూ కారులో కొంత సేపు మాట్లాడుకున్నారు. అనుష్క కారు దిగే ముందు కోహ్లీ ఆమెను అమాంతం కౌగిలించుకుని ముద్దిచ్చి మరి సెండాఫ్ చెప్పాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసేస్తున్నాయి. కొన్ని నెలల కిందట వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, విడిపోయారనే వదంతులు వచ్చిన నేపధ్యంలో, నటుడు సల్మాన్ ఖాన్ చొరవతో ఈ జంట తమ బంధాన్ని తిరిగి కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అనుష్క పుట్టిన రోజున విరాట్ కోహ్లీ ఆమెకు ఖరీదైన బహుమతి ఇవ్వడంతో పాటు సోషల్ మీడియా‌లో శుభాకాంక్షలు కూడా చెప్పాడు. ఇటీవల వారిద్దరు కలిసి డిన్నర్ చేయడంతో వీరి ప్రేమ పరిమళిస్తున్నట్లు చెబుతున్నారు.

English summary

Virat Kohli gave kiss to Anushka Sharma