ఐపీఎల్ నుంచి కోహ్లీ ఔట్!

Virat Kohli is not playing one match in IPL

03:35 PM ON 7th May, 2016 By Mirchi Vilas

Virat Kohli is not playing one match in IPL

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ కి దూరం కాబోతున్నాడు. కంగారు పడకండి ఈ స్టార్ ఆటగాడు దూరమయ్యేది ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కు మాత్రమే.. అవును స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్‌కు కోహ్లీ దూరం కాబోతున్నాడు. కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న 'రాయల్ చాలెంజర్స్ బెంగళూరు' జట్టు ఇప్పటివరకూ 7 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో గెలిచింది రెండు మాత్రమే. మిగిలిన మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రన్ రేట్ కారణంగా జట్టు ఓటమి పాలైంది. ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు విడతలుగా కోహ్లీకి 36 లక్షల రూపాయలు జరిమానా విధించింది బీసీసీఐ బోర్డు. ఈ తాజా నిర్ణయంతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ లేకుండానే బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూణె సూపర్‌ గెయింట్స్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ తలపడనుంది.

English summary

Virat Kohli is not playing one match in IPL. BCCI rejected to play Virat Kohli in one IPL match due to slow over rate.