షాకింగ్ న్యూస్: రబ్బరు బ్యాట్ వాడుతున్న కోహ్లీ

Virat Kohli is using Rubber bat

04:00 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Virat Kohli is using Rubber bat

అవునా! అయినా ఎందుకు బంగ్లావాసులు అలా ఆడిపోసుకోవడం... ఎందుకంటే క్రికెట్ అభిమానులలో బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు వేరు కదా... అందుకే ఈ పైత్యం.. శాడిజం.... ఇంకా చెప్పాలంటే పాకిస్థాన్ క్రికెట్ ప్రియుల కన్నా భారత్ క్రీడాకారులను విమర్శించడంలో బంగ్లాదేశ్ అభిమానులు మించిపోయారు. ముఖ్యంగా టీం ఇండియాను విచక్షణ మరిచి అవమానించడం పనిగా పెట్టుకున్నారనిపిస్తోంది. ఎందుకంటే, గత ఏడాది భారత్ పై సిరీస్ నెగ్గిన తర్వాత టీం ఇండియా స్టార్ ఆటగాళ్లను వెక్కిరిస్తూ అరగుండు ఫోటోలను పబ్లిష్ చేసి ఘోరంగా అవమానించారు. తాజాగా, ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ధోని తలను తమ బౌలర్‌ తస్కిన్ అహ్మద్‌ ఖండించి పట్టుకున్నట్లుగా ఓ ఫోటోను మార్ఫింగ్‌ ద్వారా సృష్టించి బంగ్లాదేశ్‌ అభిమానులు పైశాచిక ఆనందం పొందిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు పిచ్చి బాగా ముదిరిందనే చెప్పాలి. తాజాగా, ఆసియా కప్‌ ఫైనల్‌ కు ముందు తారిఖ్ హసన్ అనే బంగ్లాదేశ్ అభిమాని విరాట్ కోహ్లీ పై విచిత్రమైన ఆరోపణ చేశాడు. విరాట్ కోహ్లీ బ్యాట్‌ ముందు భాగాన్ని పూర్తిగా రబ్బర్‌తో తయారుచేసి వెనకాల భాగాన్ని వుడ్(చెక్క) తో కవర్ చేశారని, ఈ కారణంగా కోహ్లీ తన బ్యాట్‌తో బాల్‌ను టచ్ చేసిన వెంటనే బంతి బౌండరీకి వెళ్లిపోతుందని, విరాట్ కోహ్లీ ఇంత బాగా స్కోర్ చేస్తున్నాడంటే ఇదే సీక్రెట్‌ అని అతడు ఆరోపించాడు! ఈ నిజం తెలిసినప్పటికీ ఐసీసీ అతడి బ్యాట్ చెక్ చేయదని, ఐసీసీ పూర్తిగా బీసీసీఐ గుప్పిట్లో ఉండటమే దీనికి కారణమని అతడు వ్యాఖ్యానించాడు.

అంతటితో ఆగకుండా, ఫైనల్ మ్యాచ్‌లో తమ జట్టు స్టార్ బౌలర్‌ ముస్తాఫిజుర్ ఆడకుండా బీసీసీఐ అతడిని గాయపరిచిందని అతడు ఆరోపించాడు. ఇన్ని కుట్రలు చేస్తున్నా, ఫైనల్ లో బంగ్లాదేశ్ విజయం సాధిస్తుందని అతడు జోస్యం చెప్పాడు.విరాట్ కోహ్లీ బ్యాట్‌ను పట్టుకుని మరీ చూసినట్లుగా తారిఖ్ హసన్ అనే అభిమాని నిరాధార ఆరోపణలు చేయడం, ఇక అతడు చేసిన కామెంట్స్ ను బంగ్లాదేశ్ అభిమానులు వైరల్‌గా షేర్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్‌కి అతడి ‘రబ్బర్ బ్యాటే’ కారణమని బంగ్లాదేశ్ అభిమానులు మూర్ఖంగా, లాజిక్ ఆలోచించకుండా గుడ్డిగా నమ్ముతున్నారు.

ఆసియా కప్‌ పైనల్‌ లో 41 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ అంతకు ముందు మూడు మ్యాచ్‌ల్లో 41(నాటౌట్‌), 56 (నాటౌట్‌), 49 పరుగులు స్కోర్ చేసి ఈ టోర్నెమెంట్‌లో టీం ఇండియా బ్యాటింగ్‌కి వెన్నెముకగా నిలిచిన సంగతి తెలిసిందే. మోసం చేసాడని కోహ్లీ పై విమర్శలు గుప్పిస్తున్న బంగ్లా క్రికెట్ అభిమానుల తీరుని యావత్ క్రికెట్ ప్రియులు ఎద్దేవా చేస్తున్నారు.

English summary

Indian Cricketer and International Test Matches captain Virat Kohli is used Rubber bat in Asia Cup series. That's why he scored heavy runs in this series.