మహిళా విలేకరి ప్రశ్నకు కోహ్లీ అలా అనడం ఏమిటి?

Virat Kohli launches FanBox

11:26 AM ON 26th April, 2016 By Mirchi Vilas

Virat Kohli launches FanBox

లెంజండరీ క్రికెటర్‌, తాను ఎంతగానో ఆరాధించే సచిన్‌ తెందుల్కర్‌పై వస్తున్న బయోపిక్‌ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. తన అభిమానులతో నిరంతరం అనుసంధానం అయ్యేందుకు రూపొందించిన ‘విరాట్‌ ఫ్యాన్‌ బాక్స్‌’ ఆవిష్కరణ కార్యక్రమంలో కోహ్లి మాట్లాడాడు. ‘చిన్నప్పట్నుంచి నేను ఆరాధించేదెవరో అందరికీ తెలుసు. ఎవర్ని చూసి క్రికెట్లోకి అడుగుపెట్టానో.. ఆయనెప్పుడూ నాకు ఆరాధనీయుడే. సచిన్‌ బయోపిక్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఆ సినిమా చాలా ఆసక్తిగా ఉంటుంది’ అని కోహ్లి అన్నాడు. ఇదే సమయంలో త్వరలోనే విడుదలయ్యే అజార్‌, ఎంఎస్‌ ధోని చిత్రాలు వీక్షించేందుకు ఆసక్తితో ఉన్నట్లు చెప్పాడు. క్రికెట్‌, వ్యక్తిగత జీవితం, రియో ఒలింపిక్స్‌కు భారత అంబాసిడర్‌గా సల్మాన్‌ నియామకం గురించి ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించాడు. ‘నాకు తెలియని అంశం పై నేను స్పందించడం సరికాదు. ఈ అంశంపై వ్యాఖ్యానించను’ అన్నాడు.

ఇవి కూడా చదవండి: టాప్ లెస్ సెల్ఫీతో ఉద్యోగం పోయింది.. కానీ ఇప్పుడు సూపర్ ఆఫర్ కొట్టేసింది

వ్యక్తిగత జీవితం, బాలీవుడ్‌ తార అనుష్క శర్మతో అనుబంధం గురించి మహిళా విలేకరి అడగ్గా కోహ్లి తెలివిగా సమాధానం ఇచ్చాడు. ‘అది ఎవరూ తెలుసుకోకూడదు. మీ జీవితం ఎలా ఉంది? ఎలా కొనసాగుతుంది? వీటిపై నేనేమీ చెప్పకూడదు’ అని పేర్కొన్నాడు. అభిమానులు తనతో అనుసంధానం అయ్యేందుకు ‘విరాట్‌ ఫ్యాన్‌ బాక్స్‌’ మంచి అవకాశం అని, అందులో ఉండే సమాచారం చాలా ప్రత్యేకమని, ఇతర సోషల్‌మీడియాలో దొరకదని వెల్లడించాడు. మొత్తానికి అభిమాన క్రికెటర్ కోసం ఎన్నో ప్రశ్నలను కోహ్లీ ఎదుర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి:చిరు పిక్చర్ కి ముహూర్తం ఫిక్స్

ఇవి కూడా చదవండి:అడల్ట్‌ సినిమాల్లో నటించడానికి రెడీ

English summary

Virat Kohli Launched a New Fan Box and says that in that fan box . Media representatives ask some questions about Sachin movie and he said that he was waiting very eagerly for that movie.He said that he was inspired from Sachin Tendulkar.