టీమిండియాకి కోచ్ గా ద్రావిడ్ వద్దు.. అతనే కావాలి: కోహ్లి

Virat Kohli recommended Daniel Vettori as team India coach

12:22 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Virat Kohli recommended Daniel Vettori as team India coach

టీమిండియా కొత్త కోచ్ కోసం వేట ప్రారంభ‌మైంది. అయితే ద్రావిడ్‌ను కోచ్‌గా ఎంపిక చేశార‌ని వార్త‌లొచ్చాయి. అయితే భ‌విష్య‌త్‌లో టీమిండియాను ఆల్ ఫార్మాట్ల‌లో న‌డిపించే నాయ‌కుడిగా పేరొందిన విరాట్ కోహ్లీ మాత్రం న్యూజిలాండ్‌కు చెందిన డానియ‌ల్ వెటోరీని కోచ్‌గా ఎంపిక చేయాల‌ని కోరుతున్నాడ‌ట‌. ఎందుకంటే.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కోచ్ వెటోరీయే. ఐపీఎల్ ద్వారా బెంగ‌ళూరు కోచ్‌, కెప్టెన్‌గా ఇద్ద‌రి మ‌ధ్యా మంచి అండ‌ర్‌స్టాండింగ్ ఏర్పడిందట. అందుకే త‌న‌కు వెటోరీ కోచ్ అయితే బాగుంటుందని కోహ్లీ బోర్డును కోరుతున్నాడ‌ట‌..! టీమిండియా కోచ్‌గా సచిన్, ద్రావిడ్ పేర్లు వెలుగులోకి వచ్చాయి.

కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ ఎంపిక ఇక లాంఛ‌న‌మే అని ప్ర‌చారం సాగింది. టీమిండియా కోచ్‌గా ఉండాల‌ని రాహుల్ ద్ర‌విడ్‌ను బీసీసీఐ కోరినా.. ఇంత‌వ‌రకూ ద్రావిడ్ ఏ విష‌య‌మూ తేల్చి చెప్ప‌లేద‌ని స‌మాచారం. అయితే ఇదే స‌మ‌యంలో విరాట్ కోహ్లి వెటోరీ పేరును బోర్డు ముందుకు తీసుకురావడంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

English summary

Virat Kohli recommended Daniel Vettori as team India coach. Virat Kohli rejected Rahul Dravid and recommended Daniel Vettori as team India coach.