కోహ్లీ-అనుష్క బ్రేకప్‌?!

Virat kohli unfollow Anushka Sharma

10:36 AM ON 1st February, 2016 By Mirchi Vilas

Virat kohli unfollow Anushka Sharma

భారత క్రికెట్‌ జట్టు టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్ కోహ్లి-బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కశర్మ లు ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ హఠాత్తుగా అనుష్కశర్మ ను, కోహ్లీ ఫాలో అవ్వడం మానేశాడన్న వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్తారు. హఠాత్తుగా ఇలా జరగడంతో వీళ్ళిద్దరూ విడిపోయారేమో అని అందరూ అనుకుంటున్నారు. అసలే ఇప్పుడు బాలీవుడ్‌లో బ్రేకప్‌ ట్రెండ్‌ కొనసాగుతుంది. అలాగే వీళ్ళు కూడానా అనే చర్చలు మొదలయ్యాయి. అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను కోహ్లీ అన్‌ఫాలో చేయడంతో ఇలాంటి చర్చలు కొనసాగుతున్నాయి. కానీ నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు.

కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కి ఏదో సమస్య ఉందట. దానంతట అదే కొన్ని అకౌంట్లు అన్‌ఫాలో చేస్తోందట. ఎక్కువగా విజిట్ చేసేవారికి బ్లాక్‌ చేయడం కూడా జరుగుతోందట. మరి అనుష్క కోహ్లీ పేజ్ ను ఎక్కువ సార్లు చూస్తుంది కదా. అందుకే అనుష్క అకౌంట్‌ని సిస్టమ్‌ అన్‌ఫాలో చేసిందట. ఈ విషయం తెలియక అందరూ తెగ ఆరాట పడిపోతున్నారు.

English summary

Indian Cricket team Test Captain Virat kohli unfollow bollywood beauty Anushka Sharma Instagram account. Actually they both are in Love.