కొత్త ఆడీ కారుతో కోహ్లీ

Virat Kohli with new audi car

04:38 PM ON 21st May, 2016 By Mirchi Vilas

Virat Kohli with new audi car

రోజుకో కారు అన్నట్టు కార్ల మార్కెట్ సందడి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ నుంచి మరో కొత్త కారు భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆడీ ఆవిష్కరించిన ఆర్‌8వీ10 ప్లస్‌ కారును నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 2.60 కోట్లు(ఎక్స్‌ షోరూం కర్ణాటక)గా సంస్థ నిర్ణయించింది. ఈ సందర్భంగా కారుతో దిగిన ఓ ఫొటోను క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. 5.2 లీటర్‌ వీ10 మిడ్‌ ఇంజిన్‌ కలిగిన ఈ కారు గంటకు గరిష్ఠంగా 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ఆడీ తెలిపింది. ఆన్‌ డిమాండ్‌ సిలిండర్‌, కాస్టింగ్‌ మోడ్‌, డ్యుయల్‌ ఫ్యుయల్‌ ఇంజెక్షన్‌, 7 స్పీడ్‌ ఎస్‌ ట్రానిక్‌ ట్రాన్స్‌మిషన్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి.

English summary

Virat Kohli with new audi car