సెహ్వాగ్ దెబ్బకు ఇంగ్లాండ్ రిపోర్టర్ దిమ్మతిరిగింది!

Virender Swehwag mind blowing reply to England reporter

01:10 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Virender Swehwag mind blowing reply to England reporter

భారత విధ్వంసకర క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గ్రౌండ్ లో అడుగు పెట్టాడంటే బౌండరీలు తప్ప సింగిల్స్ ఉండవు. బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టగల డాషింగ్ ఆటగాడు, ఇన్నింగ్స్ మొదటి బాల్ నే ఫోర్ కొట్టగల డేరింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే. అందుకే సెహ్వాగ్ అంటే బౌలర్లు కి వణుకు పుడుతుంది. ప్రేక్షకుల్లో ఆనందం తొణికిసలాడుతుంది. ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ఆటగాడు సెహ్వాగ్. అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పినా సెహ్వాగ్ జోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. అదేంటి క్రికెట్ కి గుడ్ బై చెప్పిన ఇంకా జోరు కొనసాగడమేంటి అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే..

1/3 Pages

సెహ్వాగ్ జోరు కొనసాగిస్తోంది గ్రౌండ్ లో కాదు ట్విట్టర్ లో. భారత్ లో ఒలింపిక్స్ అనంతరం జరుగుతున్న సంబరాల గురించి ఇంగ్లాండ్ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యకు అతను ఇచ్చిన జవాబు సోషల్ నెట్ వర్క్ లో సెన్సేషనల్ అయ్యింది. '120 కోట్ల జనాభా ఉన్న దేశంలో 2 పతకాలు సాధిస్తేనే పిచ్చిగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది చాలా చిరాగ్గా అనిపిస్తోంది' అని పియర్స్ మోర్గాన్ అనే సీనియర్ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. దీనికి వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. 'మేం చిన్నచిన్న ఆనందాలను కూడా వేడుకగా జరుపుకుంటాం. కానీ క్రికెట్ ను కనిపెట్టిన ఇంగ్లాండ్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. అయినా మీరు ఇంకా వరల్డ్ కప్ ఆడుతుండటం మాకూ చిరాగ్గానే అనిపిస్తోంది' అని మాటలతో చెలరేగిపోయాడు.

English summary

Virender Swehwag mind blowing reply to England reporter