విశాఖ జోన్ వచ్చేసినట్టే

Vishaka To Get Special Railway Zone

05:35 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Vishaka To Get Special Railway Zone

రాష్ట్ర విభజన తర్వాత ఎపికి రైల్వే జోన్ లేకపోవడంతో విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో విశాఖ జోన్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి రైల్వేశాఖకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయ ని అంటున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై రైల్వేశాఖ సాంకేతిక కమిటీ సమావేశమైంది. మిట్టల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జోన్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారు. వచ్చే మంత్రివర్గ సమావేశానికి రైల్వేజోన్‌ ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా కాకినాడ-కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌కు కూడా కేంద్రం అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు. ఎప్పుడో దివంగత లోకసభ స్పీకర్ బాలయోగి హయాంలో ఈ అంశం వేగంగా ముందుకి రావడం, కాకినాడ - కోటిపల్లి రైల్వే లైన్ పునరుద్ధరణ జరగడం తెల్సిందే. అయితే బాలయోగి మరణంతో మరుగున పడ్డ కోటిపల్లి - నరసాపురం లైన్ కి మళ్ళీ మంచి రోజులు వస్తాయన్న సంకేతాలు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary

Central government to sanction special railway zone for Vishakapatnam.After Andhra Pradesh State bufirification there was no railway zone for Andhra Pradesh.Now central government was making plans to give Vishaka Raiway Zone