పేపర్లో వార్తను చూసి రైతు బ్యాంక్ లోన్ కట్టిన హీరో విశాల్

Vishal Help To Thanjavur farmer Balan

10:51 AM ON 14th March, 2016 By Mirchi Vilas

Vishal Help To Thanjavur farmer Balan

కొన్ని సంఘటనలు కొందరి కదిలిస్తాయి. అలాంటప్పుడు స్పందిస్తేనే జన్మకు సార్ధకత వుంటుంది. సరిగా అదే చేసాడు తమిళ యువ హీరో విశాల్.... ఓ బక్క చిక్కిన రైతు బాకీని తీర్చడానికి ముందుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి చెందిన బాలన్ అనే రైతు బ్యాంకులోన్ తో ట్రాక్టర్ కొన్నాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పటి దాకా చెల్లిస్తున్న రుణం తాలూకు వాయిదాలు నిలిచిపోయాయి. అలా రెండు కిస్తులు బకాయి పడ్డాడు. దీంతో పోలీసులను వెంటబెట్టుకుని మరీ బాలన్ ఇంటికి బ్యాంకు అధికారులు జప్తుకు వెళ్లారు. కాళ్లావేళ్లా పడ్డ ఆ బక్కరైతుని తోసేసి, ట్రాక్టర్ ను తీసుకెళ్లారు. అయితే బ్యాంకు అధికారుల కర్కశత్వం గురించి తమిళ పత్రికల్లో వార్తలు వచ్చాయి.

హీరో విశాల్ హృదయాన్ని ఈ ఘటన కరిగించింది. ఇక ఏమాత్రం సంకోచించకుండా బాలన్ ట్రాక్టర్ అప్పుతీర్చేందుకు విశాల్ ముందుకొచ్చాడు. “బాలన్ మీరెవరో వ్యక్తిగతంగా నాకు పరిచయంలేదు. కానీ మీరు ఒక రైతు అవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని నాకు అర్థమైంది. మీ బాకీ నేను తీరుస్తా. మనస్థాపం చెందకండి” అంటూ సోషల్ మీడియాలో అతను పెట్టిన పోస్టింగ్ ప్రశంసలు అందుకుంది. విశాల్ 'విశాల' హృదయానికి అభిమానులు జేజేలు పలుకుతున్నారు.

English summary

Kollywood Young Hero Vishal came forward to help the poor farmer named Balan who belongs to Thanjavur in Tamilnadu. Balan has take loan from bank but he unable to pay that loan amount to bank , due to that bank officials came with police and attacked on that farmer and Vishal came to know that news and came forward to help him.