కొట్టడంలో మూడు రకాలు అంటున్న హీరో విశాల్

Vishal Rayudu movie teaser

04:15 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

Vishal Rayudu movie teaser

విభిన్న కధా చిత్రాలు ఎంచుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్న విశాల్‌, 'కేరింత' హీరోయిన్ శ్రీదివ్య జంటగా నటించిన తాజా చిత్రం ‘రాయుడు’. ఈ సినిమాకి సంబంధించి 50 సెకన్ల టీజర్‌ని హాట్ హీరోయిన్స్‌ శృతి‌హాసన్‌, తమన్నా, రకుల్‌ ప్రీత్‌‌సింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. టీజర్‌లో డైలాగ్స్, ఫైట్స్‌ తప్ప మరొకటి లేదు. ‘ఓరేయ్... కొట్టడంలో మూడు రకాలున్నాయి.. ఒకటి మాట్లాడకముందే కొట్టడం.. రెండు మాట్లాడుతుండగా కొట్టడం... మూడు మాట్లాడనిచ్చి కొట్టడం’.. ఈ రాయుడు మొదటి రకమంటూ విశాల్ చెప్పే డైలాగ్ అదుర్స్ అని అంటున్నారు.

మరోవైపు ‘నడిఘర సంఘం’ ఎన్నికల్లో విశాల్- తన ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికలు ముగిసినా, అదే వేడి ఇంకా కొనసాగుతోందని కోలీవుడ్ సమాచారం. ఈ క్రమంలో వచ్చిన టీజర్‌ ప్రత్యర్థులకేనంటూ సెటైర్లు పడిపోతున్నాయి. పక్కా మాస్‌ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహించారు.

English summary

Vishal Rayudu movie teaser. Hero Vishal new movie 'Rayudu'. In this movie Sri Divya is acting as a heroine. Shruti Hassan, Tamanna and Rakul Preet Singh was released Rayudu teaser in social media.