ఒక్క ఫొటోతో లవ్ కి క్లారిటీ ఇచ్చేసిన విశాల్

Vishal Reveals About His Girl Friend

01:20 PM ON 30th June, 2016 By Mirchi Vilas

Vishal Reveals About His Girl Friend

తెలుగు వాడైనా ముందుగా కోలీవుడ్ లో సత్తా చాటి అక్కడ టాప్ హీరోగా రాణిస్తూ, సినిమాల తో పాటు సినీ రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసిన యంగ్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకుల హృదయాల ను సైతం దోచుకున్నాడు. హీరోగా వరుస గా హిట్స్ కొడుతూనే నడిగర్ సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ శరత్ కుమార్ ఢీ కొట్టి గెలవడం త మిళ సినీజనాల తో పాటు యావత్ సౌత్ ఇండియాలో ఒక్క సారిగా ఎట్రాక్ట్ అయ్యాడు.

ఇక సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో ప్రేమాయణం వార్తలతో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. చాలా రోజుల నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం వార్త ల్లో నలుగుతోంది. ఇక నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శరత్ కుమార్, విశాల్ ముఖాముఖి తలపడటంతో వీరిద్దరు కలుసుకోవడం అసాధ్యం అన్న చర్చలు కూడా వినిపించాయి.

అయితే ఈ అనుమానాలకు చెక్ పెడుతూ ఒక్క ఫొటోతో విశాల్ మొత్తం క్లారిటీ ఇచ్చేశాడు. విశాల్ తాజాగా వరలక్ష్మితో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అన్ని ప్రశ్నలకు ఈ ఫొటోనే సమాధానం చెబుతుందంటూ కామెంట్ చేశాడు.దీంతో విశాల్ పెళ్లి వరల క్ష్మితోనే కన్ఫార్మ్ అని అందుకే విశాల్ దీనిపై క్లారిటీ ఇచ్చాడన్న చర్చ ఫిల్మ్ వర్గాల్లో, సినీ లవర్స్ లో వినిపిస్తోంది.

English summary

Kollywood Young Hero Vishal has revealed his girl friend and heposted a selfie with Sharath Kumar's Daughter Varalakshmi and Posted in his Twitter Account by saying that "Dis Pic Says it All".