ఆ పార్టీ తరఫున పోటి చెయ్యనున్న విశాల్

Vishal To Contest In Tamilnadu Elections

11:00 AM ON 21st March, 2016 By Mirchi Vilas

Vishal To Contest In Tamilnadu Elections

నటులు రాజకీయాల్లో చేరడం కొత్తేమి కాదు. అలా చేరిన వాళ్ళలో కొందరు హిట్ అయితే , మరికొందరు ఫట్ అయ్యారు. తాజాగా తమిళనాట ఎన్నికల నేపధ్యంలో నటులపై ఆ యా పార్టీలు కన్నేసాయి. ఇందులో భాగంగా నటుడు విశాల్ వైపు కమలనాధుల చూపి పడిందని అంటున్నారు. బీజేపీ అధిష్టానం విశాల్ కోసం భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ను రంగంలోకి దించినట్లు, శ్రీకాంత్‌ విశాల్ తో చర్చలు జరిపినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవలే ఓ రైతు కష్టం చూసి అతని లోను కట్టడానికి విశాల్ ముందుకు రావడం ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. తమిళనాట వేళ్ళూను కోవాలని బిజెపి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా విశాల్ కు చెన్నైలోని మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇవ్వడానికి కూడా ఓకే అంటోందట.

అంతేకాదు పార్టీలో అతడికి కీలక బాధ్యతలు ఇస్తామంటోంది. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ – పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళనాట ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. ఆలోపు విశాల్ సహా కొందరు ప్రముఖ సినీతారల్ని పార్టీలో చేర్చుకోవాలని రాష్ట్ర పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక విశాల్ బీజేపీలో చేరితో త‌మిళ‌నాడులో ఉన్న తెలుగు జ‌నాలు కూడా బీజేపీకే మొగ్గు చూపుతార‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో బీజేపీ ఈ స్కెచ్ వేసిన‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే విశాల్ తెలుగు వాడే అయినా తమిళంలో నిలదొక్కుకున్నాడు. మ‌రి ఇవ‌న్నీ నిజ‌మైతే విశాల్ త‌మిళ‌నాడు అసెంబ్లీలో అడుగుపెడ‌తాడేమో చూడాలి.

ఇవి కుడా చుడండి ...

సర్దార్ వేడుకలో హైలెట్స్ ....

నీకు ఆ సత్తా ఉందని నాకు తెలుసు... చిరంజీవి

ఈ స్థాయిలో ఉన్నానంటే అన్నయ్య చలవే ...

English summary

Tamil Actor and Hero Vishal to contest in upcoming Tamilnadu Elections.Bharateeya Janata Party (BJP) was trying to join Vishal in BJP party and BJP has sent ex-cricketer Srikanth to talk with Vishal. Vishal not yet decided either he will contest in Tamilnadu elections or not.