విశ్వవిఖ్యాత నటవీర’ కృష్ణంరాజు

Vishwa Vikhyata Nata Veera Title To Krishnam Raju

11:09 AM ON 9th March, 2016 By Mirchi Vilas

Vishwa Vikhyata Nata Veera Title To Krishnam Raju

మహాశివరాత్రిని పురస్కరించుకుని రెబెల్ స్టార్ కృష్ణంరాజుకు టీఎస్సార్‌ లలిత కళాపరిషత్‌ ‘విశ్వవిఖ్యాత నటవీర’ బిరుదు ప్రదానం చేసింది. విశాఖలో టి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో కృష్ణంరాజు మాట్లాడుతూ ఇటువంటి సత్కారాలు, సన్మానాల వల్ల ఎదుగుదల ఆగిపోతుందని దూరంగా ఉండేవాడనన్నారు. అయితే ఈ సత్కారం భక్త కన్నప్పది, ప్రజలదిగా భావించి స్వీకరించానని చెప్పారు. మహాశివరాత్రి అందరినీ భక్తి భావంలోకి తీసుకెళితే నా కొడుకులాంటి తమ్ముడిని తీసుకెళ్లిపోయి దుఃఖాన్ని మిగిల్చిందన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి సమాజాన్ని రక్షించేందుకు యాగాలు చేయాల్సిన అవసరం ఉందని కృష్ణంరాజు అన్నారు. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని గత 31 ఏళ్లుగా చేస్తున్న టీఎస్సార్‌ ధన్యుడని ప్రశంసించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, సినీ నటులు సుమన్, పరుచూరి గోపాలకృష్ణ, డాక్టర్ రాజశేఖర్‌ దంపతులు పాల్గొన్నారు.

English summary

Tollywood Rebel Star Krishnam Raju was titled with "Vishwa Vikhyata Nata Veera".Subbirami Reddy awarded "Nata Virat" title to Krishnam Raju.