చెన్నై నిరాశ్రయులకు ఆశ్రయమిస్తున్న చెస్‌ ప్లేయర్‌ 

Vishwanathan Anand helps Chennai Flood Victims

01:01 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Vishwanathan Anand helps  Chennai Flood Victims

భారీ వర్షాలతో వరద నీటితో నిండా మునిగిన చెన్నై వాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు . సమస్తం కోల్పోయి రోడ్డున పడ్డ అభాగ్యులు ఎంతో మంది ఉన్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, ఉండడానికి ఆశ్రయం లేక రోడ్డున పడ్డ వారికి చెన్నైలో అనేకమంది తమకు ఉన్నంతలో సహాయపడుతున్నారు.

అనేక మంది ప్రజలు, సెలబ్రెటీలు ఇలా చాలామంది అనేక మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి చెస్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ విశ్వనాధన్‌ ఆనంద్‌ కూడా చేరాడు.

వరదల సమయంలో విశ్వనాధన్‌ ఆనంద్‌ లండన్‌లో ఉన్నాడు. విశ్వనాధన్‌ ఆనంద్‌ కుటుంబం తమ ఇంటికి వచ్చి నిరాశ్రయులకు ఉండడానికి ఆశ్రయం కల్పించి, తిండి, బట్టలు వంటి ఎన్నో సదుపాయలను తన వంతు సాయంగా ఆనంద్‌ కుటుంబం సాయపడింది. చాలా మందికి బట్టలు, దుప్పట్లు, బోజనం వంటి వాటిని కూడా ఆనంద్‌ కుటుంబం అందిస్తోంది.

విశ్వనాథన్‌ ఆనంద్‌ భార్య అరుణ ఆనంద్‌ మాట్లాడుతూ భారి వర్షాలకు అతలాకుతమైన వారికి లో తట్టు ప్రాంతాలను ఖాళీ చెయ్యమని చెప్పామని మా ఇంటిలో ఆశ్రయమిచ్చిన 20 మందిలో ఇద్దరు గర్భిణీలు కూడా ఉన్నారని తెలిపారు.

ఆనంద్‌ మాట్లాడుతూ చెన్నై లోని ప్రతి ఒక్కరు భాదితుల కోసం తాము చెయ్యగలిగిన సహాయం చేస్తున్నారని మా కుటుంబం చేసిన దాని కంటే ఎక్కువ రిస్క్‌ తీసుకుని మరీ సహాయం చేస్తున్నారని వారి సేవలను అభినందించాలని ఆనంద్‌ అన్నారు.

English summary

Chess player Vishwanathan Anand's family was helping the victims of chennai floods by offering food,shelter,clothes to them