నాగదోషం ఉన్నవాళ్లు.. పెళ్లి ఆలస్యం అవుతున్న ఆడవాళ్లు దర్శించవల్సిన ఆలయం

Visit this temple to get marriage early

11:19 AM ON 6th October, 2016 By Mirchi Vilas

Visit this temple to get marriage early

పెళ్లిళ్లు త్వరగా అవ్వకపోవడానికి అనేక కారణాలుంటాయి. కొందరికి కుజదోషం, మరికొందరికి ఏజ్ బార్, మరికొందరికి నాగదోషం ఇలా రకరకాల కారణాలుంటాయి. అయితే నాగదోషం ఉన్నవాళ్లకు నివారణకోసం ఏమేమి చేయాలి అనే విషయంలోకి వెళ్తే...

1/9 Pages

1. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు దర్శించవలసిన ఆలయం


శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం మోపిదేవి. దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణానదీ మహాత్మ్యము, ప్రముఖ క్షేత్రమైన మోపిదేవి గురించి ప్రస్తావించారని చెబుతారు. కోరిన కోర్కెలు తీర్చే మోపిదేవి స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర్రమొక్కుబడి, ఉయ్యాల ఊపు వంటి ఎన్నో మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించుకుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.

English summary

Visit this temple to get marriage early