సెల్ఫీల కోసం 20 మెగాపిక్సల్ కెమెరాతో వి5

Vivo launched a new smart phone

12:29 PM ON 16th November, 2016 By Mirchi Vilas

Vivo launched a new smart phone

స్మార్ట్ ఫోన్ల రంగంలో దూసుకుపోతున్న చైనా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో తాజాగా ఫర్పెక్ట్ సెల్ఫీ కోసం 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతో కూడిన వి5 స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 17,980 రూపాయలు. టెక్నాలజీ, డిజైన్, ఓవరాల్ పెర్ ఫార్మెన్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకువచ్చినట్లు తెలిపింది. వివిధ లైటింగ్ పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మకమైన ఫీచర్ మూన్ లైట్ గ్లోతో 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతో వి5ను రూపొందించినట్లు వివో ఇండియా సిఇఒ కెంట్ చెంగ్ అంటున్నారు. కాగా వచ్చే ఏడాది నాటికి భారత్ లో స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండింతలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివో ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వివేక్ జాంగ్ తెలిపారు.

ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని ప్లాంట్ పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తోందన్నారు.

1/2 Pages

వి5 ప్రత్యేకతలు ఏమిటంటే...

4జి ఎల్టిఇ నెట్ వర్క్
5.5 అంగుళాల డిస్ప్లే
ఆక్టా కోర్ 64 బిట్
4 జిబి రామ్, 32 జిబి రామ్(128 జిబి వరకు పెంచుకునే సామర్థ్యం)
20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 13 ఎంపి రియర్ కెమెరా
3000 ఎంఎహెచ్ బ్యాటరీ

English summary

Vivo launched a new smart phone