6 జీబీ ర్యామ్‌తో వీవో స్మార్ట్‌ఫోన్

Vivo Xplay5 Elite Smartphone

12:55 PM ON 7th March, 2016 By Mirchi Vilas

Vivo Xplay5 Elite Smartphone

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో 6 జీబీ ర్యామ్ తో ప్రపంచంలోనే మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. వీవో తాజాగా ఎక్స్‌ప్లే 5, ఎక్స్‌ప్లే 5 ఎలైట్ పేరిట తాజాగా రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఎక్స్‌ప్లే 5 ఎలైట్ లో 6జీబీ ర్యామ్ ను అందిస్తోంది. దీని ధర రూ.44,300. ఎక్స్‌ప్లే 5 ధర రూ.38,200. త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఎక్స్‌ప్లే 5 ఫీచర్లు ఇవే..

5.43 ఇంచ్ కర్వ్‌డ్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, 1440 X 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, ఫన్ టచ్ ఓఎస్ 2.5.1, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, యూఎస్‌బీ ఓటీజీ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, 4జీ ఎల్‌టీఈ, 1.8 జీహెచ్‌జడ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ఎక్స్‌ప్లే 5 ఎలైట్ ఫీచర్లు ఇవే..

5.43 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1440 X 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 2.15 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, అడ్రినో 530 జీపీయూ, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ ఓటీజీ, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో

English summary

Vivo company has previously broken records by launching the slimmest smartphone called Vivo X5 Max, with a thickness of 4.75mm. Now the Chinese tech company has once again set a benchmark for others by launching world's first smartphone with 6GB of RAM called Vivo Xplay5 Elite