కాల్ డ్రాప్స్ కోసం వొడాఫోన్‌ న్యూ టెక్నాలజీ

Vodafone New Technology To Reduce Call Drops

10:54 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Vodafone New Technology To Reduce Call Drops

కాల్‌ డ్రాప్‌లను తగ్గించేందుకు ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ సరి కొత్త సాంకేతికతను ఉపయోగించనుంది. కాల్‌డ్రాప్‌ల సమస్యకు సంబంధించి టెలికాం సంస్థలపై కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉన్న నేపథ్యంలో వాటి నివారణకు సంస్థ చర్యలకు ఉపక్రమించింది. అందు కోసం సిస్కో సంస్థ నుంచి సెల్ఫ్‌ ఆప్టిమైజింగ్‌ నెట్‌వర్క్‌(ఎస్‌ఓఎన్‌) అనే సాంకేతికతను తీసుకుంది. తమ 4జీ సర్వీసుల్ని కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ సాంకేతికత తమకు ఉపయోగపడుతుందని తెలిపింది. ఎస్‌ఓఎన్‌ ఉపయోగించడం వల్ల వాయిస్‌ కాల్స్‌ నాణ్యత పెరగడం, కాల్‌ డ్రాప్స్‌ తగ్గుముఖం పట్టడం, డాటా బ్రౌజింగ్‌ వేగం పెరగడం, నెట్‌వర్క్‌ బిజీగా ఉన్న సమయంలోనూ మెరుగైన సేవలు అందించడం వీలవుతుందని కంపెనీ చెపుతోంది.

English summary

Worlds famous Telecom Vodafone Company takes Cisco's help to reduce call drop issue.Vodafone India on Wednesday said it has deployed Cisco's Self Optimising Network (SON) technology to deliver superior mobile experience, improve voice call quality and reduce dropped calls