ఓల్వో బస్సు కాలిపోయింది.. ముగ్గురు సజీవ దహనం

Volvo bus was burned in Bangalore

11:21 AM ON 29th July, 2016 By Mirchi Vilas

Volvo bus was burned in Bangalore

మళ్ళీ బస్సులు కాలిపోతున్నాయి. కర్ణాటకాలో తాజాగా ఓల్వో బస్సులో మంటలు చెలరేగి కాలిపోయింది. దీంతో పాపం... ముగ్గురు సజీవ దహనం అయిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. దుర్గాంబ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు బెంగళూరు నుంచి ధార్వాడకు వెళ్తుండగా, బుధవారం తెల్లవారుజామున హుబ్బళ్లి సమీపంలోని వరూరు వద్ద బస్సు వెనుకభాగాన మంటలు చెలరేగాయి. ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు వెనుకభాగంలో రసాయనిక పదార్థాలు, సిగరెట్ల బండిల్స్ ఉన్నందునే మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది.

కాగా ఏపీలోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఆరంజ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఈ బస్సు, లారీని ఢీకొట్టింది. ఈ క్రమంలో డివైడర్ ను రాసుకుంటూ బస్సు కొంతదూరం వెళ్లడంతో డీజిల్ ట్యాంకు పగిలి పెద్ద ఎత్తున మంటలు లేచాయి. బస్సులో ఉన్న 42మంది ప్రయాణికులు అద్దాలు పగులకొట్టి లగేజీతో సహా సురక్షితంగా బయటకు దిగారు. బస్సు, లారీ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary

Volvo bus was burned in Bangalore