వీఆర్ గ్లాసెస్‌ పెట్టి సర్జరీ

VR glasses used during brain surgery

04:06 PM ON 18th February, 2016 By Mirchi Vilas

VR glasses used during brain surgery

ఓ రోగికి వర్చువల్‌ రియాల్టీ గ్లాసెస్‌ పెట్టి బ్రెయిన్‌ సర్జరీ చేశారు. రోగి స్పృహలో ఉన్నప్పుడే వైద్యులు అతడికి ఈ గ్లాసెస్‌ పెట్టి క్యాన్సర్‌ కణితిని తొలగించారు. ప్రపంచంలో ఈ తరహా శస్త్రచికిత్స జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఆపరేషన్‌ పశ్చిమ ఫ్రాన్స్‌లోని ఏంజెర్స్‌ ఆస్పత్రిలో జనవరి 27న జరిగింది. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. సర్జరీ సమయంలో రోగి కళ్లముందు పూర్తిగా కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించడం కోసం 3డీ గ్లాసెస్‌ పెట్టినట్లు వైద్యులు తెలిపారు. దాని ద్వారా రోగి మెదడు పనితీరును ప్రత్యక్షంగా శస్త్రచికిత్స బల్లమీదే గుర్తించి సులభంగా పరీక్షించే వీలవుతుందని ఏంజెర్స్‌ ఆస్పత్రి న్యూరోసర్జన్‌ ఫిలిప్‌ మెనీ తెలిపారు.

English summary

A patient in France undergoing brain surgery while conscious wore virtual reality glasses, as doctors removed a cancerous tumour, the chief surgeon told AFP Tuesday.Doctor Said that " creating a completely artificial world for the patient, we could map certain zones and connections of his brain related to functions that we could not, up to now, easily test on the operating table