'కత్తిలాంటోడు'కి వినాయక్ తీసుకుంటున్న పారితోషికం ఇదా?!

V.V. Vinayak remuneration for Chiranjeevi 150th movie

11:41 AM ON 27th July, 2016 By Mirchi Vilas

V.V. Vinayak remuneration for Chiranjeevi 150th movie

మెగాస్టార్ చిరంజీవి కేరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 150వ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వివి. వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' చిత్రానికి రీమేక్. చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గాను చిరంజీవికి రూ.30 కోట్ల పారితోషికం ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి వినాయక్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న అంశంపై ఇండస్ర్టీలోని ట్రేడ్ వర్గాల ద్వారా ఓ వార్త లీక్ అయ్యింది. వాస్తవానికి వినాయక్ కు 'అఖిల్' సినిమా ముందు వరకు రూ.10 కోట్ల వరకు ఆయనకు పారితోషికం ఉందన్న టాక్ ఇండస్ర్టీలో ఉంది. 'అల్లుడు శీను' సినిమాకు బెల్లంకొండ ఆయన హైదరాబాద్ లో ఓ ఖరీదైన ఇల్లు కూడా ఇచ్చారన్న వార్తలు వచ్చాయి.

అయితే 'అఖిల్' ఘోరంగా ప్లాప్ అవ్వడంతో వినాయక్ రేటు, కేరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయాయి. అయినా చిరు మాత్రం తనకు 'ఠాగూర్' లాంటి హిట్ ఇచ్చిన వినాయక్ కే ఓటేశాడు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నందుకు గాను వినాయక్ కు పారితోషికం లేదట. ఇందుకు గాను వినాయక్ కు ఈ సినిమా ఈస్ట్ గోదావరి పంపిణీ హక్కులు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు ట్రేడ్ వర్గాల టాక్. వినాయక్ తూర్పు గోదావరి జిల్లా పంపిణీ హక్కులను అనుశ్రీ ఫిలింస్ అనే లోకల్ డిస్ర్టిబ్యూటర్ ద్వారా ఈ సినిమాను ఆ జిల్లాలో రిలీజ్ చేస్తారని ట్రేడ్ టాక్. చిరు 150వ సినిమా ఈస్ట్ హక్కులు రూ 5.5 కోట్ల వరకు రేటు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి వినాయక్ రేటు బాగా పడిపోయిందని తెలుస్తోంది.

English summary

V.V. Vinayak remuneration for Chiranjeevi 150th movie