నితిన్‌ పై వినాయక్‌ ఫిర్యాదు!!

V.V. Vinayak want to complaint on Nithin in Film Chamber

03:16 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

V.V. Vinayak want to complaint on Nithin in Film Chamber

అక్కినేని అఖిల్‌ హీరోగా వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించిన 'అఖిల్‌' చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో ఈ చిత్ర నిర్మాత అయిన హీరో నితిన్‌కి దర్శకుడు వి.వి.వినాయక్‌కి మధ్య వైరం పెరిగిందని చెబుతున్నారు. అఖిల్‌ చిత్రం పై ఇన్వెస్ట్‌ చేసిన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే వినాయక్‌ 3 కోట్లు పరిహారం ఇచ్చాడన్న విషయం తెలిసిందే. వాళ్ళని రక్షించి ఇప్పుడు వినాయక్‌ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం నితిన్‌ వినాయక్‌కు 12 కోట్లు పారితోషికం ఇస్తానని ముందుగా 8 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చాడని, అయితే సినిమా విడుదలయ్యి అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో మిగతా 4 కోట్లు ఇవ్వడానికి నితిన్‌ మొహం చాటేస్తున్నాడని వినిపిస్తుంది.

మిగిలిన పారితోషికం కోసం వినాయక్‌ ఫోన్‌ చేసినా నితిన్‌ కానీ నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి కానీ ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో నితిన్‌ పై వినాయక్‌ ఫిలిం చాంబర్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. 'అఖిల్‌' చిత్రం ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ దాదాపు 47 కోట్లు ఖర్చు అయితే ఆ తరువాత 18 కోట్లు అయినా వసూలు చేయకపోవడంతో నితిన్‌ భారీగా నష్టపోవడం వల్ల చేసేది లేక చేతులెత్తేసాడని అంటున్నారు. హీరో అఖిల్‌కి కూడా నితిన్‌ రూపాయి పారితోషికం కూడా ఇవ్వలేదని సమాచారం.

English summary

V.V. Vinayak want to complaint on Nithin in Film Chamber. Why because Nithin is not responding for to give 4 crores to Vinayak.