ఎన్టీఆర్‌ తో వినాయక్‌ సినిమా 

V.V.Vinayak Movie With NTR

04:52 PM ON 28th December, 2015 By Mirchi Vilas

V.V.Vinayak Movie With NTR

స్టార్‌ దర్శకుడు వి.వి.వినాయక్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్లో వచ్చిన ఆది, అదుర్స్‌ సినిమాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికి తెలిసిందే. గత కొద్దికాలంగా మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు . అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతన్నట్లు స్వయానా వి.వి.వినాయక్‌ చెప్పడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'నాన్నకు ప్రేమతో' ఆడియో ఫంక్షన్‌కు అతిధిగా వచ్చిన వి.వి.వినాయక్‌ స్టేజ్‌ మీదకు రాగానే నందమూరి అభిమానులందరూ ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడనే గోల ఎక్కువ అవ్వడంతో దాని పై స్పందించిన వినాయక్‌, ఎన్టీఆర్‌ తో త్వరలోనే ఒక సినిమా చేస్తానని, అయితే ఆ సినిమా ఆది-2 లేక అదుర్స్‌-2 అవుతుందా అనే విషయం మీకు త్వరలోనే చెబుతామని వినాయక్‌ చెప్పాడు. నాన్నకు ప్రేమతో సినిమా పై వినాయక్‌ మాట్లాడుతూ ఈ సినిమా సూపర్‌హిట్‌ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు .

ఇవి కూడా చదవండి !!

'ఎన్టీఆర్‌' ఎకౌంట్‌ హ్యాక్‌ చేసేశారు!!

రాజమౌళికి ఇష్టమైన హీరో అతనే..

కన్నడంలో పాడనున్న యంగ్‌ టైగర్‌

'ఎన్టీఆర్‌' బాలీవుడ్‌ బ్యూటీతో రొమాన్స్ చేస్తాడా?

English summary

Good news for NTR Fans. As we know two hit movies aadi and adhurs hit silver screen with the vinayak and ntr comination. Now another movies coming out with this combo.