వైకుంఠ దర్శనంతో పోటెత్తిన ఆలయాలు 

Vykunta Yekadasi Darshan

02:15 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Vykunta Yekadasi Darshan

పవిత్ర ధనుర్మాసం ... అందునా ముక్కోటి ఏకాదశి ... పలు వైష్ణవ ఆలయాలు వైకుంఠ ద్వారా దర్శనంతో పోటెత్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో పాటూ , చిన్నచిన్న ఆలయాలు కూడా భక్తులతో నిండిపోయాయి. తిరుపతితో పాటూ ఆయా ఆలయాల దగ్గర వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచడంతో తెల్లవారుజ్హామునుంచి , మధ్యాహ్నం వరకు భక్తులు ఆయా ఆలయాల దగ్గర బారులు తీరారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. విఐపిల తాకిడి కూడా ఎక్కువాగానే కనిపించింది. ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి ), సింహాచలం, యాదగిరి గుట్ట , అలాగే హైదరాబద్ , విజయవాడ , రాజమండ్రి , కాకినాడ , విశాఖ , శ్రీకాకుళం ఇంకా పలు ప్రాంతాల్లో రామాలయాలు , శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు , శ్రీ రంగ నాధుని ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. ఇక సోమవారం కూడా కావడంతో శివాలయాలు కూడా భక్తులతో నిండిపోయాయి. శివ కేశవు లకు ప్రీతి పాత్రమైన రోజుగా పలువురు అభివర్ణించారు.

వైకుంఠ ఏకాదశి , ముక్కోటి ఏకాదశి అంటే .....

ఇంతకీ వైకుంఠ ఏకాదశి , ముక్కోటి ఏకాదశి అనే వివరాలలోకి వెళితే, .... ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. అలాగే ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాబారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ప్రచారంలో వుంది.

ఇక ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ఉపవాసం, జాగరణ. తర్వాత జపం, ధ్యానం ముఖ్యమైన వని పెద్దలు చెబుతారు.

విష్ణుపురాణం ప్రకారం పరిశీలిస్తే, ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ కోరారు. అందుకే ఈ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తుంటారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు.

English summary

In the occasion of Vykunta Yekadasi the Lord Vishnu temples like Tirupathi,Dwarakatirumala,Yadagiri Gutta temples were crowed with huge ammount of devotes today