లేవకుంటే కొట్టుడే

Wake up machine

06:43 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Wake up machine

తెల్లవారితే లెగుద్ధాం అని అలారం పెట్టుకోవడం అది ఎంతసేపు మోగినా దాన్ని ఆపేసి నిద్రమత్తులోని జారుకోవడం మనకు అలవాటే. తర్వాత అయ్యో అనుకోవడం కూడా మామూలే. ఇలాంటి సందర్బాలు ఇక ఎదురవవు.

ఎందుకంటే మిమల్ని నిద్రలేపడానికి కొట్టిలేపే యంత్రాన్ని కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే స్వీడన్‌కు చెందిన షిమోన్ అనే యువతి ఈ మిషన్‌ను తయారు చేసింది. ఈ మిషన్‌ పేరు వేకప్‌ మిషన్‌ ఇది అలారం మోగిన తరువాత కనుక నిద్ర లేవకపోతే కొట్టిమరీ లేపుతుందట. ఈ మిషన్‌ని మనం పడుకునే మంచం పైనే అమర్చుకోవచ్చు. అలారం మోగిన తర్వాత లేవకపోతే కొట్టుడే కొట్టుడు. ఈ మిషన్‌ కరెక్ట్‌ గా పనిచేస్తుందని, దీన్ని ఇంకా మెరుగు పరచాల్సివుందని షిమోన్ తెలియజేసారు. అన్ని విధాలుగా సరిచూసిన తరువాత మార్కెట్లో విడుదల చేస్తాం అని చెప్పారు. అయితే ఇంకేం ఈ మిషన్‌ ని కొనడానికి సిద్దం కండి ఇక మీ బాస్‌తో తిట్లు తప్పించుకున్నట్లే.

English summary

Wake up machine.The wake up machine was invented by shemone that machine name is wake up machine.