త్వరలో వాల్ మార్ట్ సొంత మొబైల్ పేమెంట్ సిస్టమ్

Walmart to Launch Own Mobile Pay System

05:22 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Walmart to Launch Own Mobile Pay System

అంతర్జాతీయ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ తన సొంత మొబైల్ పేమెంట్ సిట్టమ్ ను రూపొందించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి టెస్టింగ్ ను మొదలు పెట్టింది. తొలుతగా అమెరికాలోనే దీనిని వినియోగించనుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఇది అందుబాటులోకి రానుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఇలా రెండు ఓఎస్ ల్లోనూ వినియోగించేలా దీనిని రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు వాల్ మార్ట్ గిఫ్ట్ కార్డుల ద్వారా కూడా ఇందులో చెల్లింపులు చేయవచ్చు. వినీయోగదారులు త్వరిత గతిన చెల్లింపులు చేసేందుకు వీలుగా ఈ కొత్త వ్యస్థను తీసుకువస్తున్నట్టు వాల్ మార్ట్ వెల్లడించింది.

English summary

World's largest retailer wallmart sait that it is testing its own mobile payment system that will allow shoppers to pay with any major credit or debit card or its own store gift card through its app