చిరు నాగ్‌ల మధ్య వార్ ఎందుకు?

War Between Chiru And Nagarjuna

06:32 PM ON 19th February, 2016 By Mirchi Vilas

War Between Chiru And Nagarjuna

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మంచి స్నేహితులు ... పైగా బిజెనెస్ పార్టనర్స్ కూడానూ … అంతేకాదు మా టివి నిర్వాహకులు .... ఇద్దరి మధ్యా మంచి రిలేషన్స్ మెయింటెన్ అవుతున్నా, ఎక్కడో కాలింది... ఇంక ఎక్కడై వుంటుంది క్యాష్ దగ్గరే నెమో .... అందుకే నాకే టార్గెట్ పెడతావా అంటూ వార్ కి చిరు సై అంటున్నాడని వార్తలు షికారు చేస్తున్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు బాక్సీపీస్ ని షేక్ చేశాయి అయితే, ప్రస్తుత బాక్సాపీస్ లెక్కలతో పోల్చుకుంటే చిరంజీవికి అంత రికార్డ్ లేద నే మాట వినిపిస్తోంది. చిరు రాజకీయాల్లోకి వెళ్ళాక, ఇప్పుడు ఇండస్ట్రీలో గల పెద్ద హీరోలలో నాగార్జున నెంబర్ వన్ లో వున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని చిత్రాలతో నాగార్జున వరుస విజయాలను నమోదు చేసుకుని, బాక్సాపీస్ ని దుమ్మురేపుతున్నాడు.

తాజాగా ఈ సంక్రాంతికి రిలీజైన నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’ మూవీ 50 కోట్ల రూపాయల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. దీంతో బాలయ్య, విక్టరి వెంకటేష్ కి సాధ్యం కానీ ఫిట్ ని నాగ్ సొంతం చేసుకున్నాడు. ఇక పెద్ద హీరోలలో మెగాస్టార్ గా పేరుతెచ్చుకున్న చిరంజీవి ప్రస్తుతం చేయబోయే 150 చిత్రం కనీసం 100కోట్లకి మించి కలెక్షన్స్ చేయాలి. లేని పక్షంలో కనీసం 50 కోట్లు సాధించే సినిమాగా ఉండాలని లెక్కలు వేస్తున్నారు. ఇక చిరంజీవి మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చే సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంది. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి తరువాత ఈ మూవీకి ముహుర్తం ఖరారవుతుందట. పెళ్లి పని అయ్యాక సినిమా మీద దృష్టి పెట్టి, తడాఖా చూపాలని కసి గా ఉన్నాడట. నేను అలా రాజకీయాల్లోకి వెళ్ళాక, రికార్డులు బద్దలు కొడుతూ, దూసుకుపోతున్న నాగ్ పై పైచేయి సాధించడంలో చిరు ఏమేరకు కలెక్షన్స్ సాధిస్తాడో చూడాలి. మొత్తానికి మిత్రుడి టార్గెట్ అధిగమించడం చిరుకి పెద్ద సవాల్ అయిందని ఇండస్ట్రీలో ప్రస్తుతం పిచ్చా పాటీ మాటల్లో నడిచే టాక్ .

English summary

Recently Senior hero Akkineni Nagarjuna's film Soggade Chinni Nayina movie was collected 50 crores till now.Now Chiranjeevi was going to make his 150th film.As a Senior Hero in Tollywood Chiranjeevi have to cross the Soggade Chinni Nayana Collections by his !50th film.