పవన్-మహేష్ మధ్య సీరియస్ వార్..

War between Mahesh Babu and Pawan Kalyan

04:11 PM ON 31st March, 2016 By Mirchi Vilas

War between Mahesh Babu and Pawan Kalyan

ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ స్ధానం ఎవరిది అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ నంబర్ వన్ స్ధానానికి ఇద్దరు హీరోలు ఎప్పుడూ పోటీ పడుతున్నారు. వారే సూపర్ స్టార్ మహేష్ బాబు- పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ వేసవిలో వీరిద్దరూ నటించిన సినిమా లు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. అయితే ఈ ఇద్దరి సినిమాల రిలీజ్ మధ్య కొంత గ్యాప్ ఉన్నా... రికార్డ్ల విషయంలో మాత్రం గట్టిగా పోటీ కనిపిస్తుంది. ఇప్పటికే 'సర్దార్ గబ్బర్సింగ్' ఆడియో రిలీజ్ అయి, సినిమా పై భారీ అంచనాలు సంపాదించుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 8న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చెయ్యబోతున్నారు.

ఇది కూడా చదవండి: 6,800 కోట్లు.. ఇది ఆస్తి కాదు పెళ్లి ఖర్చు!

ఇంక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం ఆడియోను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసి మే లో సినిమా ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. కలెక్షన్ ల విషయంలో ఈ రెండు చిత్రాల మధ్య గట్టి పోటీ జరగడం ఖాయం. అయితే ఓవర్‌సీస్ మార్కెట్లో మాత్రం మహేష్ బాబు పై చేయి సాధించాడు. 'బ్రహ్మోత్సవం' ఓవర్సీస్ రైట్స్ 13 కోట్లకు అమ్ముడవ్వగా, 'సర్దార్ గబ్బర్సింగ్' మాత్రం 11.5 కోట్ల వద్దే ఆగిపోయింది. అయితే శాటిలైట్ రైట్స్ విషయంలో మాత్రం ఈసారి పవన్ దే పై చేయి అయింది.

ఇది కూడా చదవండి: ఫుల్ గా తాగి బికినీ లో రెచ్చిపోయి డ్యాన్స్ వేసిన సన్నీ

'సర్దార్ గబ్బర్సింగ్' శాటిలైట్ రైట్స్ 13 కోట్లకు అమ్ముడవ్వగా, బ్రహ్మోత్సవం మాత్రం 11.5 కోట్లు వద్దే ఆగిపోయింది. సినిమా విడుదల కాక ముందే వీరిద్దరి మధ్య ఇంత పోటీ నెలకొంటే, ఇంక సినిమా విడుదల తరువాత కలెక్షన్ ల విషయంలో ఇంకెంత పోటీ నెలకొనబోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

English summary

War between Mahesh Babu and Pawan Kalyan. War between Brahmotsavam and Sardar Gabbar Singh movies in summer.