చరణ్ తో రామ్ కి గొడవా ?

War between ram and ram Charan

12:01 PM ON 20th May, 2016 By Mirchi Vilas

War between ram and ram Charan

రామ్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌తో గొడవకి రెడీ అవుతున్నాడు. రామ్‌కి, రామ్‌ చరణ్‌ అంతటి పేరు లేకపోయినా చెర్రీతో గొడవకి సిద్ద మవుతున్నాడు. గొడవ ఏంటి సిద్దం అవడం ఏంటి అనుకుంటున్నారా... సినిమాల పరంగా చెర్రీ అంత ఇమేజ్‌ లేకపోయినా రామ్‌ డైరెక్ట్‌గా ఫైటింగ్‌కి సిద్దం అయిపోతున్నాడు. చాలా రోజులుగా వరుస ప్లాపులలో కృంగిపోయిన రామ్‌ ఒక్కసారిగా నేను శైలజ చిత్రంతో తిరిగి సక్సెస్‌ ట్రాక్‌పైకి ఎక్కాడు. 2016 రిలీజ్‌ అయిన ఈ చిత్రం రామ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.

ఇది కుడా చూడండి: ఎన్టీఆర్‌ తరువాత సినిమా పోస్టర్‌ వచ్చేసింది

నేను..శైలజ చిత్రం తరువాత ఐదు నెలలు గ్యాప్‌ తీసుకున్న రామ్‌ మరో చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో రామ్‌కి కందిరీగ వంటి హిట్‌ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ప్రస్తుతం మరో సినిమా చేస్తున్నాడు. 14 రీల్స్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. అయితే దసరాకి అంటే అక్టోబర్‌ లో రామ్‌ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలంటే రామ్‌ ఖచ్చితంగా రామ్‌ చరణ్‌తో పోటీ పడాల్సిందే.

ఇది కుడా చూడండి: సెల్ఫీ దిగుతుంటే జారిన డ్రెస్

చెర్రీ రెండు వరుస ప్లాపుల తరువాత ధ్రువ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు దసరా కానుకగా రానున్నాడు. రామ్‌ దర్శకుడి కధపై నమ్మకంతో చెర్రీ వంటి స్టార్‌ హీరోతో ఢీ కొట్టేందుకు రెడీ అంటున్నాడు.

ఇది కుడా చూడండి: రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతోనేనా?

English summary

War between ram and ram Charan.