నాలుక కోస్తావా..? నీ ఇంటికొస్తా.. టచ్ చేసి చూడు. ..

War between the politicians...

11:20 AM ON 12th January, 2017 By Mirchi Vilas

War between the politicians...

రాజకీయ నేతల్లో అనంతపురం టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి ది విలక్షణ శైలి. ఎవరినైనా సరే విమర్శించే నైజం. ఛలోక్తులతో ప్రసంగం ఇలా ఎన్నో లక్షణాలున్నాయి. ఇక తాజాగా వైసీపీ నేతలపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యంగా జగన్ , శ్రీకాంత్ రెడ్డిలపై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. బుధవారం జిల్లాలోని పైడిపాలెం ఎత్తిపోతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జేసీ ప్రసంగించారు. వయసులో చిన్నవాడు.. చిన్నప్పటి నుంచి చూసినవాడు అనే ఉద్దేశంతో కొద్దిగా ఆప్యాయంగా వాడు అని జగన్ ను సంభోధించానే తప్ప పొగరుతో కాదన్నారు. తాను అలా పిలవడాన్ని నిరసిస్తూ ఆయన పార్టీ నేతలు ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు చేశారు. అందుకే ఇకనుంచి జగన్ ను వాడు అని సంబోధించనని, శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధిస్తానని జేసీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్ చిన్నవాడనుకున్న కానీ ఆయన పెద్దవాడయ్యాడరన్నారు.

ఇక శ్రీకాంత్ రెడ్డి విమర్శలపై స్పందించిన జేసీ.. తాను బూట్లు నాకేవాడిని అయితే ఎప్పుడూ మంత్రిగానే ఉండేవాడినని అన్నారు. శ్రీకాంత్ రెడ్డి నన్ను జానీవాకర్ అంటావా? నాకు తాగే అలవాటు లేదు.. సారా మా ఇంట వంట లేదు... తాగే అలవాటు వాళ్లకే ఉంది. నా నాలుక చీలుస్తావా? అంత మగాడివా? ఎక్కడికి రావాలో చెప్పు.. నీ ఊరికొస్తా.. పులివెందులకు వస్తా.. నన్ను ముట్టుకొని చూడు ఏం అవుతదో తెలుస్తది అని జేసీ ధ్వజమెత్తారు. శ్రీకాంత్ రెడ్డికి ఏం తెలుసని మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు.

ఇది కూడా చూడండి : ఖైదీ నెంబర్ 150 రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చూడండి : బైక్ ను ఉదయాన్నే సెల్ఫ్ తో కాకుండా కిక్ తో స్టార్ట్ చేయాలి, కారణం ఇదే

ఇది కూడా చూడండి : ఆ సినీ నటి మరణం .. అనుమానాస్పదం

English summary

In politics Annanthapuram M.p have a different type of style, He always criticize everyone in his different manner.Recently he criticized Y.C.P leaders Jagan and SriKanth.