బాహుబలికి దీటుగా ....

War Scenes Will Be Highlighted In Balakrishna 100th movie

10:13 AM ON 5th April, 2016 By Mirchi Vilas

War Scenes Will Be Highlighted In Balakrishna 100th movie

ఇప్పటికే నందమూరి నటసింహం బాలయ్య వందో మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచుతూ, జక్కన్న తీసిన బాహుబలికి దీటుగా తీసే సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి ఫీవర్ నడుస్తోంది. అందుకే అందుకు ఏమాత్రం తీసుపోకుండా అదిరిపోయే అద్భుతమైన గ్రాఫిక్స్ తో బాలకృష్ణ సినిమా కూడా రూపొందించాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడట. పైగా చారిత్రక ప్రాధాన్యమున్న గౌతమీపుత్ర శాతకర్ణి రాజుల కాలం నాటి స్టోరీ కావడంతో యుద్ధ సన్నివేశాలను చాలావరకు ఫారిన్ లో షూట్ చేయాలని డైరెక్టర్ క్రిష్ ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన గ్రాఫిక్ వర్క్స్, భారీ సెట్టింగులు, లావిష్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాలని క్రిష్ భావిస్తున్నట్టు తెలిసింది. వార్ సీన్స్ తీయడానికి అనువైన ఫారిన్ లొకేషన్స్ ని త్వరలో డిసైడ్ చేయనున్నారు. యోధుడు అనే తాత్కాలిక టైటిల్ తో రానున్న ఈ సినిమా గురించి ఈ నెల 8 ఉగాది సందర్భంగా అమరావతిలో అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. క్రిష్ డైరెక్ట్ చేసిన కంచె మూవీ యుద్ద్డ సన్నివేశాలను జార్జియాలో షూట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కుడా చదవండి:

సర్దార్ టికెట్ల కోసం ఇంటినే అమ్మేశాడు

విడుదలకు ముందే బాహుబలి రికార్డు బ్రేక్

జనతా గ్యారేజ్ లో హరికృష్ణ షాకింగ్ రోల్!

English summary

Bala Krishna was going to be act under the direction of director Krish as his 100th movie. This movie details to be announced in Amaravathi on Ugadi Festival. There were war sequences in this movie and this war sequences will be going to be shoot in Foreign locations.