దాడుల వీడియోలు కేంద్రం చేతికొచ్చేశాయి.. విడుదలకు రెడీ!

War videos was came to cabinet

03:14 PM ON 6th October, 2016 By Mirchi Vilas

War videos was came to cabinet

ఉగ్రవాదులను మట్టుబెట్టడాన్ని భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ఉత్తిదే అని ఓ పక్క పాకిస్థాన్ సర్కారు బుకాయిస్తూ వచ్చింది. మరోవైపు ఇదంతా హంబక్... భారత సైన్యం ఆడిన డ్రామా అని పాక్ మీడియా కోడై కూస్తోంది! ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్స్ కి సంబంధించిన వీడియోలు విడుదల చేయండి అని మన దేశం నుంచే డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా భారీ చర్చ జరుగుతోంది. వీరందరికీ సమాధానం చెప్పేందుకు, సందేహాలను పటాపంచలు చేసేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది. ఇందులో భాగంగా గతనెల 28వ తేదీ అర్ధరాత్రి తర్వాత నియంత్రణ రేఖ దాటి, పీవోకేలోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన దృశ్యాల వీడియో క్లిప్పింగ్స్ ను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది.

సైనిక చర్యలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలున్నా వాటిని కేంద్రానికి అప్పగించాలన్న నిబంధన ఉండడంతో సర్జికల్ స్ట్రైక్స్ వీడియో క్లిప్పింగ్స్ కేంద్ర ప్రభుత్వానికి భారత సైన్యం అప్పగించింది. అంతేకాదు, వీటిని బహిర్గతం చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్జికల్ స్ట్రైక్స్ జరగనే లేదనే ఆరోపణలు, పిచ్చి వాదనలను మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. అలాంటి వాళ్ల నోళ్లు మూయించాలని నిర్ణయించుకున్నాం అని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. వీటిని విడుదల చేయాలా వద్దా, చేస్తే ఎప్పుడు అనేది ప్రధానమంత్రి కార్యాలయమే(పీఎంవో) నిర్ణయిస్తుంది. దీనిని విడుదల చేస్తే పాక్ గొంతులో పచ్చివెలక్కాయ పడటం ఖాయం అని మరో అధికారి చెప్పారు.

సర్జికల్ స్ట్రైక్స్ పై సందేహాలన్నీ అర్థంపర్థం లేనివి. దాడులు జరిగాయి. అది కూడా భారీ స్థాయిలో జరిగాయి. అటు వైపు తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయి అని వివరించారు. ఆర్మీ నుంచి వీడియో క్లిప్పింగ్స్ అందినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ ఆహిర్ మీడియాకు తెలిపారు. వీడియోల విడుదలపై ప్రధానమంత్రే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. దాడులపై రాజకీయాలు చేయడం దురదృష్టకరమని, సైన్యం ప్రతిష్ఠను మసకబార్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అంశాలపై నిర్ధిష్ట విధి విధానాలను అనుసరించాల్సి ఉంటుంది. సర్జికల్స్ స్ట్రైక్స్ గురించి ప్రధానమంత్రి కానీ, రక్షణ మంత్రికానీ, హోంమంత్రికానీ ప్రకటించలేదు.

డీజీఎంవో స్వయంగా ఈ ప్రకటన చేశారు. తాము ఏం చేశామో చెప్పాల్సింది ఆర్మీయే. అదే కరెక్ట్ అని హన్స్ రాజ్ తెలిపారు. గతంలో ఇలాంటి అంశాలపై లిఖితపూర్వక నివేదికలు సమర్పించేవారని, ఇప్పుడు కాలం మారిందని, వీడియో క్లిప్స్ ఇచ్చారని ఆయన వివరించారు. సైన్యం వీడియో క్లిప్స్ సమర్పించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజుజు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాన్ని అంతా విశ్వసించాలి. సైన్యం తన పని తాను చేసుకునేలా చూడాలి అని సూచించారు. కాగా సర్జికల్ స్ట్రైక్స్ పై ఎవరు పడితే వారు, ఏది పడితే అది మాట్లాడవద్దని మంత్రివర్గ సహచరులకు ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసినట్లు తెలిసింది.

బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పై అధీకృత వ్యక్తులు మాత్రమే స్పందించాలి. మిగిలిన వారు మాట్లాడొద్దు. అంతేకాదు, ఈ అంశంపై హిస్టీరియా వాతావరణాన్ని సృష్టించొద్దు అని మంత్రులకు సూచించారని అంటున్నారు. అలాగే బుధవారం మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దుల్లో పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. మరోవైపు... గురువారం జరగాల్సిన రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఈనెల 14వ తేదీకి వాయిదా పడింది.

English summary

War videos was came to cabinet