ఆ వార్తలను పెయిడ్ న్యూస్ గా పరిగణించాలన్న రేవంత్

Warangal bielections campaign

05:18 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Warangal bielections campaign

వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం వాడీ వేడీ విమర్శలతో వేడెక్కింది. తరచూ టి ఆర్ ఎస్ తీరుపై ధ్వజమెత్తే తెలంగాణా టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అధికార టి ఆర్ ఎస్ పార్టీ తమ ఛానెళ్లల్లో వార్తలను ప్రసారం చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లఘింస్తోందని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ , టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా టీన్యూస్, నమస్తే తెలంగాణ పత్రికల్లో వస్తున్న వార్తలను పెయిడ్‌న్యూస్‌గా పరిగణించాలని డిమాండ్ చేశారు. నమస్తే తెలంగాణ వార్తాపత్రిక కాదని , దాన్ని టి ఆర్ ఎస్ కరపత్రంగా భావిస్తు న్నామని ఆయన అన్నారు. ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి పరిమితి కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని. ఆయన పేర్కొంటూ వెంటనే అతడిని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులతో పాటు వరంగల్ రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. కేంద్ర బృందం వచ్చి ఎన్నికల ప్రచారంలో అవకతవకలను పరిశీలించాలని రేవంత్ కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పథకాలను ప్రవేశపెట్టి టి.సర్కార్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోందని ఆయన అన్నారు. మరోపక్క టి ఆర్ ఎస్ పై కాంగ్రెస్ , బిజెపి కూడా విమర్శ ల జడివాన కురిపిస్తుంటే , టి ఆర్ ఎస్ కూడా దీటుగానే స్పందిస్తోంది. పోలింగ్ దగ్గర పడుతున్నందున ప్రచారంలో మరిన్ని విమర్శలతో పాటూ వ్యక్తిగత విమర్శలు కూడా తీవ్రంగా హెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary

Warangal bielections campaign.Warangal bielection campaign heates up with criticism