ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రేపే - అన్ని పార్టీల్లో ఉత్కంఠ 

Warangal By-Election Counting Starts Tomorrow

01:23 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

Warangal By-Election Counting Starts Tomorrow

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసారు. మంత్రి కడియం శ్రీహరి రాజీనామాతో వరంగల్ లోక సభ కు నవంబర్ 21న పోలింగ్ నిర్వహించిన సంగతి తెల్సిందే. మొత్తం 23మంది అభ్యర్ధులు పోటీచేయగా , ప్రధానంగా నాలుగు పార్టీల మధ్యే పోటీ నెలకొంది. టి ఆర్ ఎస్ , కాంగ్రెస్ అభ్యర్హ్డులతో పాటూ , బిజెపి - టిడిపి ఉమ్మడి అభ్యర్ధిని బిజెపి నిలబెట్టింది. ఇక వైస్సార్ కాంగ్రెస్ కూడా రంగంలో వుంది. 2014 ఎన్నికల్లో వరంగల్‌ స్థానంలో 76.51శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 3.92 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. ఉప ఎన్నికలో మాత్రం 69.01శాతం ఓటింగ్‌ నమోదైయింది. వాడీ వేడీ ప్రచారంతో సాగిన వరంగల్ ఉప ఎన్నికలో పోలింగ్ దశ ముగిసి , నవంబర్ 24న లెక్కింపునకు సన్నద్ద మవుతోంది. ఎన్నికల అధికారి భన్వర్ లాల్ నేతృత్వంలో అధికార యంత్రాంగం కౌంటింగ్ ఏర్పాట్లు చేసింది.


లెక్కింపు సమయం దగ్గర పడడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. పైకి ఎవరి మటుకు వారు విజయం తమదేనని ధీమాగా వున్నా లోలోపల గుబులు నెలకొందని చెప్పవచ్చు. మండలాలు, గ్రామాల్లో నమోదైన పోలింగ్‌ శాతాలను విశ్లేషించే పనిలో అన్ని పార్టీల నేతలు బిజీగా ఉన్నారు. మిగిలిన పార్టీలతో పోల్చితే టీఆర్‌ఎస్‌ నేతలు ఈ కసరత్తులో ఎక్కువగా నిమగ్నమయ్యారు. పోలింగ్‌ శాతానికి అనుగుణంగా తమ మెజారిటీ ఉంటుందనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ప్రచార సమయంలోనే ఈ అంశంపై దృష్టి పెట్టింది. 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్‌ ఎంపీ స్థానంలో 76.51 శాతం ఓటింగ్‌ నమోదవగా, తాజా ఉప ఎన్నికలో 69.01 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రధానంగా వరంగల్‌ ఎంపీ సెగ్మెంట్‌లోని వర్థన్నపేట, పరకాల, పాలకుర్తి, భూపాలపల్లి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదైంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ ఈ నియోజకవర్గాలపైనే కేంద్రీకృతమైంది. ఇక్కడ ఓటరు ఎవరికి పట్టం కట్టారు? అనే దానిపై ఉప ఎన్నిక ఫలితం ఆధారపడి ఉంటుందని ఆయా పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి గెలుపొందగా.. అప్పుడు వరంగల్‌ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యరిగా ఉన్న కడియం శ్రీహరికి భారీ ఆధిక్యం లభించింది. తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ధర్మారెడ్డి.. నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ సైకిల్‌ దిగి కారెక్కారు. తాజా ఉప ఎన్నికలో పరకాల లో భారీ పోలింగ్‌ నమోదు కావటం విశేషం. ఇది ఎవరికి అనుకూలమనేది వివిధ పార్టీల నేతలు స్పష్టంగా తేల్చుకోలేకపోతున్నారు.

వర్థన్నపేటలో, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తిలోనూ భారీ ఓటింగ్‌ నమోదైంది. గతంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఎర్రబెల్లి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి శ్రీహరికి అక్కడ భారీ మెజారిటీ లభించింది. ఈ నేపథ్యంలో తాజా ఓటింగ్‌ సరళి వల్ల ఎవరికి కలిసి వస్తుందనేదని ఆసక్తిగా మారింది. ఇక స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో పెరిగిన ఓటింగ్‌ శాతంలో తమ వాటా ఎంత అనే కోణంలోనూ పార్టీలు ఆలోచన చేస్తున్నాయి.


ఇక గెలుపు ఎవరిదీ అనే అంశంపై జోరుగా పందాలు కాస్తున్నారు. ఇటు తెలంగాణా లోనే కాకుండా , అటు ఎపిలో కూడా పందెం రాయుళ్ళు మంచి జోరు మీదున్నారు ముఖ్యంగా గెలుపెవరిది అనే అంశం ఒక్కటే కాకుండా, మెజార్టీ ఎంత ? రెండవ స్థానం ఎవరికి? వంటి అంశాల మీద పందెం జోరందుకుంటోంది. రెండవ స్థానం గురించి గట్టిగానే పందెం వెళ్తోంద ...

English summary

Warangal By-elections votes counting to be start tomorrow. All the political parties and people were eagerly waiting for results of waragnal by-elections.