ప్రశాంతంగా  ఓరుగల్లు  పోలింగ్ -  ఓటేసిన ప్రముఖులు 

Warangal By-Elections Poling

12:23 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Warangal By-Elections  Poling

ఈ వి ఎం ల పై తొలిసారిగా అభ్యర్ధుల ముఖ చిత్రాలు రూపొందించి , నిర్వహిస్తున్న వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది మొత్తం 23మంది అభ్యర్ధులు పోటీలో వుండగా, మొత్తం 1,778 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. అత్యధికంగా వర్ధన్న పేటలో 34% పోలింగ్ నమోదవ్వగా , అత్యల్పంగా వరంగల్ ఈస్ట్ లో 21.5%పోలింగ్ నమోదైంది. . మందకొడిగా మొదలైన పోలింగ్ క్రమంగా ఊపందుకుంది. ఉదయం 11 గంటలకు 27.69 శాతం పోలింగ్ నమోదైంది. పలువురు ప్రముఖులు , అభ్యర్ధులు వోటు వేసారు. తెలంగాణా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వడ్దేపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నరసక్క పల్లిలో డిప్యూటి స్పీకర్ మధుసూదనాచారి ఓటు వేసారు. సంగం మండలం బొల్లికుంటలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్, పర్వతగిరి పోలింగ్ కేంద్రాల్లో టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటేశారు. కొడగండ్ల మండలంలో రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పాలకుర్తి మండలం టికారంలో కొద్దిసేపు ఈవీఎంలు మొరాయించింది. దీంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. ఈవీఎం మొరాయించడంతో పరకాల మండలం వెంకటేశ్వరపల్లిలో గంట ఆలస్యంగా పోలింగ్ నమోదు అయ్యింది. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో కారెంట్ లేకపోవడంతో కొవ్వొత్తి వెలుగులో పోలింగ్ మొదలైంది.


గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఓటు హక్కురావడం నేపధ్యంలో ఉప ఎన్నికలో హిజ్రాలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంబాగ్‌లోని వాణివిద్యానికేతన్‌లో హిజ్రాలు ఓటు వేశారు. మొత్తం 284 మంది హిజ్రాలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.


పరకాల మండలం వెంకటేశ్వరపల్లిలో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్‌ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. పాలకుర్తి మండలం తీగారంలో ఈవీఎం మొరాయించడంతో అరగంట ఆలస్యమైంది. హన్మకొండలోని కళాశాలలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో విద్యుత్తు లేక కొవ్వొత్తుల వెలుగులో పోలింగ్‌ సాగించారు. కాగా తమ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదంటూ తొర్రూరు మండలం వెలికట్ట శివారు టి.కే తండా వాసులు పోలింగ్‌ను బహిష్కరించారు. రోడ్లు, పాఠశాల భవనం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కూడా లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత పాలకులు తమను పట్టించుకోలేదని తెలంగాణ వచ్చిన తర్వాతైనా తమ బతుకులు మారుతాయనుకుంటే టీఆర్ఎస్ సర్కార్‌కు కూడా తాము కనిపించడం లేదని వాపోయారు. తండాలో 450 మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక నాయకులు నచ్చజెబుతున్నా వారు వినడం లేదు. అంతేకాదు తండాలో పోలింగ్ బూతు కూడా పెట్టలేదని, వృద్ధులు కిలోమీటర్ల దూరం ఎలా వెళ్తారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.

English summary

Warangal By eleactions poling goes on peace full conditions, Evms not works properly in some places,.Vips Voted Their Votes.