విపక్షాలకు షాక్ ఇచ్చిన  'ఓరుగల్లు'

Warangal Results Shocks Opposition Parties

01:50 PM ON 24th November, 2015 By Mirchi Vilas

Warangal Results Shocks Opposition Parties

రాజకీయ చైతన్యానికి మారుపేరు ఓరుగల్లు. ఇక్కడి ప్రజలు మరోసారి టి ఆర్ ఎస్ కి పట్టం కడుతూ అద్బుత విజయాన్ని అందించారు. మొదటి రౌండ్ నుంచీ ఆధిక్యంలో దూసుకుపోతూ , వెనుదిరిగి చూడకుండా టి ఆర్ ఎస్ విజయ పదాన నిలవడానికి వరంగల్ ప్రజలు బాసటగా నిలిచారు. గతంలో కడియం శ్రీహరి కి వచ్చిన మెజార్టీ కంటే అధికంగా మెజార్టీ కట్టబెట్టారు అద్వితీయ విజయంతో టి ఆర్ ఎస్ శ్రేణులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవు తుంటే , విపక్షాలు స్థితి అందుకు భిన్నంగా వుంది. . ఆహా ఒహో అన్న విపక్షాల కు గట్టి షాక్ నిచ్చించి ఓరుగల్లు ఫలితం. డిపాజిట్ కోసం వెతుక్కునే పరిస్థితి విపక్షాలకు వచ్చిందంటే సామాన్య విజయం కాదు. ప్రభుత్వం వ్యతిరేకత తమను గట్టేక్కిస్తాయన్న విపక్షాల ఆశలు అడి యాసలు అయ్యాయి.

తెలంగాణకు పోలైన ఓట్లు.. ప్రత్యర్థి పార్టీలకు పోలైన ఓట్లకు మధ్య అంతరం అంతకంతకు హేచ్చుతూనే వుంది తప్ప , ఎక్కడా బెసక లేదు. . మధ్యాహ్నం 12 గంటల సమయానికి టీఆర్ ఎస్ కు మొత్తం 4.05లక్షల ఓట్లు పోల్ కాగా.. కాంగ్రెస్కు 1.17లక్షల ఓట్లు వచ్చాయి. ఇక..టిడిపితో జతకట్టిన బీజేపీకి అయితే లక్ష లోపే. ఓట్ల లెక్కింపు అనంతరం వెలువడుతున్న ఫలితాల తీరు విపక్షాల నోట మాట రాని పరిస్థితి తెచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి టి ఆర్ ఎస్ 6,08,431 ఓట్లు సాధించి , గెలుపు గుర్రం అందనంత దూరానికి చేరింది. కాంగ్రెస్ కి 1,54,988 ఓట్లు , బిజెపికి 1,29,118 ఓట్లు పడ్డాయి. వైస్సార్ సిపికి 21,147 ఓట్లు మాత్రమే వచ్చాయి. వైస్సార్ సిపి కన్నా శ్రమజీవి పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. శ్రమజీవి కి 25వేల 544 ఓట్లు వచ్చాయి.

కొంతలో కొంత మేలు అన్నట్లు పోస్టల్ బ్యాలట్లలో మాత్రం కాంగ్రెస్ అన్నీ ఓట్లు కొల్లగొట్టింది. ఇంతకీ అవి ఎన్నంటే కేవలం నాలుగంటే నాలుగే. టి ఆర్ ఎస్ అభ్యర్ధి పుసునూరి దయాకర్ కు పోస్టల్ బ్యాలెట్ లో ఒక్క ఓటు కూడా రాలేదు. మొదట్లోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కించడం కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే సత్యనారాయణకు మొత్తం నాలుగూ వచ్చేయడంతో కొంత హుషారు కన్పించినా , ప్రజలు ఓట్లు వేసిన ఈవి ఎం లు తెరిచేసరికి డిపాజిట్ కూడా వస్తుందా రాదా అనే పరిస్థతి కాంగ్రెస్ కి ఎదురైంది. కడపటి వార్తలందే సరికి టి ఆర్ ఎస్ అభ్యర్ధి దయాకర్ నాలుగున్నర లక్షల పైచిలుకు మెజార్టీతో దూసు కు పోతున్నారు. అన్ని సెగ్మెంట్ లలో టి ఆర్ ఎస్ దే పైచేయి. మొత్తానికి వరంగల్ ఉప ఎన్నిక రానున్న రోజుల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తు దనడంలో సందేహం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి 2019 ఎన్నికల్లో టి ఆర్ ఎస్ ని ఓడించడానికి టిడిపితో సహా అన్ని పార్టీలతో జత కడతామని చెప్పకనే చెప్పారు.

English summary

Warangal By-Election Result Shocks Every Party In Telangana State by winning with a huge ammount of majority.