వార్న్ వారియర్స్ దే   “ఆల్ స్టార్స్ క్రికెట్ ట్రోఫీ”

Warne Warriors Holds “All Stars Cricket Trophy”

05:56 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Warne Warriors Holds “All Stars Cricket Trophy”

ఆల్ స్టార్స్ క్రికెట్ ట్రోఫీ షేన్ వార్న్ జట్టు కైవసం చేసుకుంది .తాజాగా సచిన్ బ్లాస్టర్స్ , వార్న్ వారియర్స్ మధ్య జరిగిన రెండో టీ20 లో 57 పరుగుల తేడాతో వార్న్ జట్టు విజయం సాధించింది . మొదట బ్యాటింగ్ చేసిన వార్న్ వారియర్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 262 పరుగులు సాధించింది. తరువాత 263 పరుగుల భారి లక్ష్యంతో బరిలోకి దిగిన సచిన్ బ్లాస్టర్స్8 వికెట్ల నష్టానికి కేవలం 205 పరులు మాత్రమే చేయగల్గింది .దీంతో సిరీస్ వార్న్ వారియర్స్ వశమైంది .సచిన్ బ్లాస్టర్స్ ఓపెనర్లు

సెహ్వాగ్ , తరువాత వన్ డౌన్లో వచ్చిన గంగూలీలు తక్కువ స్కోర్ కే ఔటవ్వడం.. తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ పెద్దగా రాణించక పోవడంతో బ్లాస్టర్స్ జట్టు ఓటమి పాలయ్యింది . వరుసగా రెండో టీ-20 లోను విజయం సాధించిన వార్న్ వారియర్స్ ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను గెలుచు కుంది . క్రికెట్ కు అమెరికాలోను ప్రాచుర్యం తీసుకు వచ్చేందుకు ప్రపంచ క్రికెట్ లో దిగ్గజాలైన క్రికెటర్లంతా రెండు టీం లుగా ఏర్పడి 3 మ్యాచ్ ల టి -20 సిరీస్ ఆడుతున్నారు . క్రికెట్ గాడ్ సచిన్ ..స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ ఈ సిరీస్ కి రూపకల్పన చేసారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను ఈ మ్యాచ్ లు విశేషం గా రంజింప చేస్తున్నాయి. ఈ నెల 14 వ తేదిన ఈ రెండు జట్ల మద్య 3 వ టీ-20 మ్యాచ్ జరగా నుంది.

English summary

Warne Warriors Holds “All Stars Cricket Trophy”