సచిన్ బ్లాస్టర్స్ పై వార్న్ వారియర్స్ విజయం

Warne Warriors Wins Over Sachin Blasters

06:56 PM ON 9th November, 2015 By Mirchi Vilas

Warne Warriors Wins Over Sachin Blasters

ప్రపంచ క్రికెట్ దిగ్గజాలందరిని ఒక త్రాటి పైకి తెస్తూ అభిమానులను అలరించడానికి ముందుకు వచ్చిన అల్ స్టార్స్ క్రికెట్ లీగ్ ఆరంభమైంది.

మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ అభిమానులను ఆసాంతం ఆకట్టుకుంది . ప్రేక్షకులు భారీగా హాజరైన ఈ మ్యాచ్ కి సచిన్ ఎట్రాక్షన్ గా నిలిచాడు . శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో సచిన్ బ్లాస్టర్స్ పై వార్న్ వారియర్స్ విజయం సాధించింది. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న వార్న్ వారియర్స్ బౌలర్ ల పై ఓపెనర్లు సచిన్ , సెహ్వాగ్ విరుచుకుపడ్డారు. సెహ్వాగ్ తనదైన రీతిలో చెలరేగి కేవలం 22 బంతుల్లోనే 55 పరుగులు సాధించాడు. ఈ జోడి తొలి వికెట్ కు 8 ఓవర్లలోనే 85 పరుగుల జోడించారు. దీంతో సచిన్ బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 140 పరుగుల స్కోర్ ను సాధించింది.

All Stars Cricket League

141 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వార్న్ వారియర్స్ పాంటింగ్ (48 నాటౌట్ ), సంగక్కర (41) చేలరేగడంతో మరో 16 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. వార్న్ వారియర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ షేన్ వార్న్ (3/20) కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సిరీస్ లో వార్న్ వారియర్స్ 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. రెండో టీ-20 ఈ నెల 11న హోస్ట న్ లో జరగనుంది.

English summary

Warne Warriors Wins Over Sachin Blasters