కేసిఆర్ ని చంపేస్తామన్నది ఎవరు ?

Warning Phone Call To KCR

04:30 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Warning Phone Call To KCR

తెలంగాణా సిఎమ్ కేసిఆర్ ని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయట. దీనిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ కోరుట్ల ఎంఎల్ఎ కల్వకుంట్ల విద్యాసాగర రావు మొబెల్ ఫోన్ కి ఎవరో కాల్ చేసి సిఎమ్ కెసిఆర్ ని చంపేస్తామని హెచ్చరించాడట. పైగా పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ చెల్లి పెళ్ళికి బుధవారం సిఎమ్ కెసిఆర్ హాజరవుతున్నందున ఈ సందర్భంగా చంపేస్తామంటూ కాల్ రావడం దుమారం రేపింది. ఈమేరకు ఇంటర్ నెట్ ఫోన్ నుంచి విద్యాసాగర రావు కు కాల్ రావడం, దీని పై విద్యాసాగరరావు ఆగ్రహం వ్యక్త్యం చేస్తూ , పక్కనే వున్న ఎస్సై కి ఫోన్ అందించడంతో సదరు ఎస్సై తో కూడా ఆ అపరిచితుడు అలాగే మాట్లాడట.దీంతో విషయాన్ని జగిత్యాల డిఎస్పీ దృష్టికి తీసుకెళ్ళడంతో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఆ అపరిచితుడు ఎవరి ఉంటారా అని సర్వత్రా చర్చ సాగుతోంది.

English summary

An Anonymous man makes call to Kareem Nagar MLA Kalwakuntla Vidya Sagar Rqao and warns him that they will kill KCR.Police were taken this issue very serious and started search for who had made this phone call.