మీ శరీరంలో తగినంత నీరు లేదని చెప్పే సూచనలు ఇవే

Warning Signs of lacking water in your body

05:35 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Warning Signs of lacking water in your body

మన శరీర బరువులో సుమారు రెండు వంతుల నీరు ఆక్రమించి ఉంటుంది. అంతేకాక ఒక వ్యక్తి నీరు లేకుండా ఎక్కువ రోజులు జీవించి ఉండలేడు. శరీరంలోని ప్రతి కణం,అవయవం మరియు కణజాలం నీటి మీద ఆధారపడి ఉన్నాయి. శరీరంలో నీరు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

* శరీరంలో ద్రవాలను సంతులనం చేయటానికి సహాయపడుతుంది.
* శరీర ఉష్ణోగ్రత నిర్వహణ మరియు నియంత్రణ చేస్తుంది.
* కీళ్ళు మరియు కళ్ళను లూబ్రికేట్ గా ఉంచుతుంది.
* కణజాలం, వెన్నుముక మరియు కీళ్ళను రక్షిస్తుంది.
* శరీరంలో వ్యర్ధ పదార్దాలను మరియు విషాలను తొలగించటానికి సహాయపడుతుంది.
* జీర్ణక్రియకు సహాయపడుతుంది.
* తీసుకొనే కేలరీల నియంత్రణలో సహాయపడుతుంది.
* చర్మం యవన్నంగా ఉండటానికి సహాయపడుతుంది.

శరీరంలో నీరు ఉంటేనే కార్యకలాపాలు సక్రమంగా జరుగుతాయి. అందువల్ల శరీరాన్ని ఎప్పుడు హైడ్రేడ్ గా ఉంచుకోవాలి. శరీరం హైడ్రేడ్ గా ఉండటానికి తగినంత నీటిని త్రాగుతూ, నీరు ఎక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. కొన్ని సమయాల్లో శరీరం ధృడమైన శారీరక శ్రమ, అధికంగా చెమట పట్టుట, అతిసారం, వాంతులు, మధుమేహం మరియు మూత్రవిసర్జన కారణంగా ఎక్కువగా నీటిని కోల్పోవచ్చు.

చాలా మందికి శరీరంలో నీరు తగ్గిందనే విషయం కూడా తెలియదు. ఇప్పుడు చెప్పుతున్న సంకేతాల ద్వారా శరీరంలో నీరు తగ్గిందని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

1/11 Pages

1. తలనొప్పి మరియు తల తిరగటం

తలనొప్పి మరియు తల తిరగటం అనేది శరీరంలో నీరు లేదని చెప్పే సంకేతాలలో ఒకటి. హైడ్రేడ్ గా ఉంటే కనుక  తేలికపాటి గడ్డలు మరియు కదలికల నుండి రక్షిస్తుంది. శరీరం ఆర్ద్రీకరణ స్థాయిలో లేకపోతే మెదడు చుట్టుపక్కల ద్రవం మోతాదు తగ్గుతుంది. ఇది తలనొప్పి,మైగ్రేన్ తలనొప్పులకు దారితీస్తుంది.

అంతేకాక నిర్జలీకరణం వలన మెదడుకు ఆక్సిజన్ మరియు రక్త ప్రవాహం తగ్గుతుంది. క్లినికల్ న్యూరాలజీ హాండ్ బుక్ లో ప్రచురించిన 2010 నివేదికలో నిర్జలీకరణం కారణంగా మైగ్రేన్ తలనొప్పి, ఒత్తిడితో కూడిన తలనొప్పి వస్తాయని తెలిపింది. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు మాత్రను ఒక గ్లాస్ మంచి నీటితో వేసుకోవాలి. నిర్జలీకరణం వలన వచ్చిన తలనొప్పి అయితే వెంటనే తగ్గిపోతుంది.

English summary

Here are the list of health tips. Without water, your body would stop functioning properly. Hence, it is important to keep your body hydrated. To stay hydrated, drink fluids and eat foods rich in water content.