ఈ మోడ్రన్ సావిత్రి చాలా హాట్ గురూ(వీడియో)

Warrior Savitri hot video song

03:38 PM ON 30th July, 2016 By Mirchi Vilas

Warrior Savitri hot video song

సావిత్రి.. అనగానే మనకు మహా నటి సావిత్రి, లేక సతీ సావిత్రి గుర్తుకు వస్తుంది. కానీ మనం ఇక్కడ మాట్లాడుకోబోయే సావిత్రి మాత్రం చాలా హాట్ గురూ. ఇది ఎంత హాట్ అంటే.. తాజాగా విడుదలైన వీడియో సాంగ్ తో ప్రస్తుతం ఈ సావిత్రి హీటెక్కించేస్తోంది. పరమ్ గిల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సావిత్రి చిత్రంలో నిహారికా రైజాదా సావిత్రి పాత్రలో కనిపించనుంది. హాలీవుడ్ సెక్స్ బాంబ్ లూసీ పిండర్ ని ఈ సినిమాతో బాలీవుడ్ కి తీసుకొస్తున్నారు. పురాణాల్లో సావిత్రికి మోడ్రన్ టచ్.. అంటూ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చుకుంటూ, సినిమాపై హైప్ పెంచే పనిలో ఉన్నారు.

ఇది రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్. ఆగస్ట్ 25న ఈ మోడ్రన్ సావిత్రిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక 'వారియర్ సావిత్రి' సినిమా ఇప్పటికే వివాదాల్లోకెక్కింది. అలనాటి సావిత్రికి మోడ్రన్ టచ్.. అంటూ హిందూ మత సంప్రదాయాల్ని దెబ్బతీస్తున్నారంటూ వారియర్ సావిత్రికి వ్యతిరేకంగా కొందరు ఆందోళనలు చేపడ్తున్నారు. అయితే, సినిమాలో ఎక్కడా సావిత్రిని కించపర్చడంలేదని దర్శకుడు అంటున్నాడు. మొత్తానికి ఈ మోడ్రన్ సావిత్రి మాత్రం చాలా హీటెక్కిస్తోంది. ఒకసారి ఆ వీడియో పై మీరు ఒక లుక్ వేసేయండి.

English summary

Warrior Savitri hot video song