రూ. 2000 నోటు నీటిలో తడిస్తే ఏమౌతుందో చూడండి(వీడియో)

Washing and crushing new 2000 rupee note

10:51 AM ON 15th November, 2016 By Mirchi Vilas

Washing and crushing new 2000 rupee note

శల్య పరీక్ష చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. తాజగా రెండువేల నోటుకి పెట్టే పరీక్షలు చూస్తే షాకవుతారు. ఎందుకంటే, పాత నోట్ల రద్దు ప్రకటన వెలువడగానే కొత్త నోట్లకు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఏర్పడింది. కొత్త 2వేల నోటు చేతిలోకి రాగానే అంతా సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. ఒకతను అయితే రెండు ముక్కలు చేసి మరీ పోస్ట్ పెట్టాడు. ఇక కొత్త నోట్ల నాణ్యత గురించి పెద్ద చర్చే జరుగుతుంది. మరి ఈ కొత్త 2వేలు నోటును అరగంట పాటు నీటిలో నానబెడితే ఏం జరుగుతుంది. మెత్తబడిపోతుందా? నలిపేస్తే చినుగుతుందా?

1/3 Pages

ఇప్పటికే నెట్ లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియోలో మాత్రం నోటుని ఎంత నలిపేసినా చినగలేదు. అంతా బాగానే ఉంది. నీటి కుళాయి కింద రూ.2000 నోటును ఉంచిన ఓ వీడియోను ఇటీవల యూట్యూబ్ లో పోస్ట్ చేయగా ఇప్పటి వరకూ 5 మిలియన్స్ కు పైగా వ్యూస్ వచ్చాయి. ఇలాంటి పలు వీడియోలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. వాటికీ లక్షల్లో వ్యూస్ రావడం విశేషం. ఈ వీడియో పై ఓ లుక్కెయ్యండి.

English summary

Washing and crushing new 2000 rupee note