ఇది నిజంగా కెవ్వు కేక్

Washington Nurse Resigns by Sending cake

10:38 AM ON 2nd July, 2016 By Mirchi Vilas

Washington Nurse Resigns by Sending cake

ఏమిటి అనుకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే. అమెరికాకు చెందిన షరా అనే మహిళ ఓ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తోంది. అయితే అక్కడ ఇస్తున్న జీతం ఆమెకు సరిపోవడం లేదు. పైగా పనిభారం ఎక్కువైపోతోంది. హాస్పిటల్ కు వస్తున్న రోగులకు సరిపడా సిబ్బంది లేరు. సౌకర్యాలు లేవు. ఇక చిన్న చిన్న తప్పులకు పెద్ద పెద్ద పనిష్మెంట్లు ఇస్తున్నారు. అందుకే ఆ ఉద్యోగా న్ని వదిలేయాలనికుంది. పలకాలనుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా యజమాన్యంతో గొడవ పెట్టుకునో, లేకపోతే అసలు కారణం చెప్పకుండానో మానేస్తారు. కానీ ఆమె ఆలాంటి వేవీ చేయలేదు. చాలా విభిన్న పద్ధతిలో తన రాజీనామా అందించి, అందరినీ ఆకట్టుకుంది. అదేమంటే,

ఓ పెద్ద కేక్ తయారు చేయించి, దాని మీద తన రాజీనామా లేఖను రాసి, దానిని తమ మేనేజర్ కు ఇచ్చింది. ఇలా వెరైటీగా వచ్చిన రెజిగ్నేషన్ ను చూసి ఆశ్చర్యపోయాడతను. మానేసి వెళ్లిపోతున్న ఆమెను మనస్ఫూర్తిగా అభినందించాడు. అంతేకాదు ఆ కేక్ ను హాస్పిటల్ సిబ్బందికి పంచాడు. ఆ సిబ్బంది కూడా ఆమెను తలుచుకుంటూ విచారం వ్యక్తం చేశారు. ఇక ఆమె ఆలోచనను నెటిజన్లు సైతం మెచ్చేసుకుంటున్నారు. భలే ఉంది కదా కెవ్వు కేక్.

ఇది కూడా చూడండి: న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది.?

ఇది కూడా చూడండి: పేరు లో మొదటి అక్షరం ఏం చెప్తుంది ?

ఇది కూడా చూడండి: తారలు..వారి భార్యలు

English summary

Washington Nurse Resigns by Sending cake.