'సైజ్‌జీరో' చూడండి 1 కేజి బంగారం గెలవండి!!

watch size zero movie and win 1 kg gold

02:00 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

watch size zero movie and win 1 kg gold

అనుష్క నటించిన తాజా చిత్రం 'సైజ్‌జీరో' ఈ చిత్రం కోసం అనుష్క 20 కేజీలు బరువు పెరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య నటిస్తున్నారు. సోనాల్‌ చౌహన్‌ మరో ముఖ్యపాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వం వహించగా, పివిపి పతాకం పై పరమ్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే 'యూ.ఎ' సర్టిఫకేట్‌ అందుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం ప్రమోషన్‌కి సంబంధించిన సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసారు. అదేంటంటే ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకులకి 1 కేజి బంగారం గెలుచుకునే అవకాశం కల్పిస్తుంది.

ధియేటర్‌ వద్ద ఈ చిత్రం టికెట్‌తో పాటు ఒక వోచర్‌ని కూడా ఇస్తారు. ఆ వోచెర్ పై ఉన్న 11 నెంబర్లు గల కోడ్‌ని 9545466666 కి మెసేజ్‌ చెయ్యండి లేదా www.pvpcinema.com లో రిజిస్టర్‌ అవ్వండి. అలా రిజిస్టర్‌ చేసుకున్న వారి నుండి మూడు వారాల తర్వాత 20 మంది లక్కీ డీప్‌ విన్నర్స్‌ని ఎంపిక చేస్తారు. మళ్ళీ ఆ 20 మంది లో లక్కీడ్రా పెట్టి ఒకరిని విజేతగా ఎంపిక చేస్తారు. ఆ విజేతకు అనుష్క చేతుల మీదుగా 1 కేజీ బంగారాన్ని అందజేస్తారు. పైరసీని అంతం చేయడం కోసమే ఈ ఆలోచనని పరిగణలోకి తీసుకున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాంలో స్టార్‌ నటుడు నాగార్జున, రానా దగ్గుపాటి, జీవా, తమన్నా, కాజల్‌, హన్సిక, మంచు లక్ష్మీప్రసన్న, రేవతి, శ్రీదివ్యలు అధితులుగా కనిపించబోతున్నారు.

English summary

watch size zero movie and win 1 kg gold