అబ్బో , బూతు చూస్తే భక్తి పొంగిపోతుందట.?

Watching Adult Movies Makes People More Religious

10:37 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Watching Adult Movies Makes People More Religious

రక్తి - భక్తి - ముక్తి అన్నారు మనవాళ్ళు ... కామి కాని వాడు మోక్ష గామి కాడని కూడా అంటారు. కానీ ఇప్పుడో పరిశోధనలో బూతు (పోర్న్) చూస్తే భక్తి తత్వం పొంగి పొర్లుతుందని తేలిందట. ఎప్పుడూ వినని, ఊహలకైనా రాని ఈ షాకింగ్ న్యూస్ ని ఓ అమెరికన్ నిపుణుడు కనుక్కున్నాడు. వారానికోసారి మాత్రమే పోర్న్ చూసేవాళ్ల కన్నా రెండు. లేదా అంతకన్నా ఎక్కువసార్లు చూసేవాళ్ళలో భక్తి భావనలు ఉప్పొంగుతాయని, ప్రార్థనలు చేయాలనే ఆలోచనలు ఉధృతమవుతాయని శామ్యూల్ పెర్రీ అనే పరిశోధకుడు అంటున్నాడు. తాము తప్పు చేశామన్న గిల్టీ ఫీలింగ్ తో వీళ్ళు ప్రేయర్స్ చేయడం మొదలుపెడతారని ఈయన వాదన. ఆరేళ్ళ కాలంలో ఈయన 1300 మందికి పైగా వ్యక్తుల నడవడికను పరీక్షించి ఈ విషయం తేల్చాడు.

ఇవి కూడా చదవండి:చెల్లెమ్మ ఇరగదీసిందట

పోర్నోగ్రఫీ అన్నది. దీన్ని తక్కువసార్లు చూసే వారిమీద, అదే సమయంలో ఎక్కువ సార్లు చూసేవారిమీద ఎలాంటి ప్రభావం చూపుతుందని శామ్యూల్ అధ్యయనం చేశాడు. చాలా సార్లు చూసేవారు తాము చర్చీలకు, ఇతర ప్రార్థనా మందిరాలకు వెళ్తుంటామని, ప్రేయర్లు చేస్తుంటామని తెలిపినట్టు ఆయన వివరించాడు. అంటే తామేదో తప్పు చేశామన్న గిల్టీ ఫీలింగ్ వారిలో కనుక్కున్నానని చెప్పాడు. ఆత్మన్యూనత వారిలో కనిపించిందని విశ్లేషించాడు. ఇది మనుషుల్లోని చిత్రమైన మనస్తత్వాన్ని ప్రతిబింబించిందని పేర్కొన్నాడు. అలాగే తక్కువసార్లు పోర్న్ చూసినవారు తమలో ఆత్మన్యూనతా భావం లేదని, ప్రార్థనా మందిరాలకు తక్కువగా వెళ్తుంటామని చెప్పారట.. తన పరిశోధనల సారాంశాన్ని ఆయన సెక్స్ రీసర్చ్ అనే మెడికల్ జర్నల్ లో వివరించాడు. అదండీ సంగతి. ఎవరి శోధన వారిది మరి.

ఇవి కూడా చదవండి:ఆంటీ అయితేనేం క్రేజ్ తగ్గలేదు

ఇవి కూడా చదవండి:బాయ్ ఫ్రెండ్స్ తో చాటింగ్ వద్దన్నందుకు భర్త వేళ్లను కోసేసింది

English summary

Researchers Found that Watching Adult Movies Makes Man And Woman More Religious. This was found by a researcher from America named Samuels Perri. He was saying that when people see Adult Movies they think that they had done wrong thing and they used to pray god.