భూమి కుంగింది - సొరంగం పొంగింది

Water Coming Out From Earth In Rudravaram

12:38 PM ON 13th April, 2016 By Mirchi Vilas

Water Coming Out From Earth In Rudravaram

రుద్రవరం గ్రామ సమీపాన భూమి కుంగిపోయింది. దీంతో ఐదు రోజుల క్రితం సొరంగం ఏర్పడింది. ఈ సొరంగంలో నాలుగో రోజు నీరు ఉబికి ఉబికి పైకి వచ్చింది. సొరంగంలోంచి నీరు పైపైకి వచ్చేస్తోంది. పైగా సొరంగం మరింత వెడల్పుగా మారటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు . భూమి లోపలి పొరల మధ్య తేడా రావటంతో ఇలా జరిగిందా? అనే సందేహం కూడా వెంటాడుతోంది. భూమి లోపల ఒత్తిడి వల్లే మామూలు పంట పొలంలో భూమి కుంగిపోయి ఇలా సొరంగం ఏర్పడిందేమో అనే అనుమానం కలుగుతోంది. గంట గంటకు సొరంగంలో మట్టి లోపలికి వెళ్తోంది. నీరు పైకి వస్తోంది. సొరంగంలోకి నీరు ఎలా వస్తోందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. చూడ్డానికి జనం వస్తున్నారు.

English summary

Water Coming out from Earth in Rudravaram in Andhra Pradesh. Suddenly the water floating from earth was increasing .