ఏపీ సీఎం ఇంటికి నీళ్లు బంద్‌

Water connection was stopped to Ap cm Chandra Babu Naidu

12:39 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Water connection was stopped to Ap cm Chandra Babu Naidu

ఏపీ సీఎం చంద్రబాబు క్యాంప్‌ ఆఫీసుకు మాత్రం ఫుల్‌గా నీళ్లు సరఫరా అవుతున్నా, ఆయన ఇంటికి నీళ్లు బంద్ పెట్టారు. చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి బిచానా విజయవాడకు సర్దుకున్నారు. క్యాంప్‌ ఆఫీసు కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. పాలనా వ్యవహరాలన్నీ విజయవాడ నుంచే నిర్వర్తిస్తున్నారు. అలాంటప్పుడు హైదరాబాద్‌లోని క్యాంప్‌ ఆఫీసుకు ఇంత పెద్ద ఎత్తున నీటి సరఫరా చేయడమేమిటని పలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయట. నగరంలో నీటి కటకట ఎదుర్కొంటున్న పలు ప్రాంతాలకు సరఫరా చేయకుండా, వీఐపీలకు, సంపన్నులకు పెద్దపీట వేయడమేమిటని ప్రశ్నిస్తున్నాయి.

చంద్రబాబు ఇంటికి నీళ్లు, కరెంటు సరఫరా కట్‌ చేయాలని ఇప్పటికే ఓయూ జేఏసీ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతి పత్రమిచ్చింది. సీఎం కేసీఆర్‌ ఇంటికి, క్యాంప్‌ ఆఫీసులకు సుమారు 4.85 లక్షల లీటర్ల నీళ్లను జలమండలి సరఫరా చేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు బంజారా హిల్స్‌లోని రోడ్‌ నెం. 65లో పాత ఇంటిని కూల్చి కొత్త ఇల్లును నిర్మిస్తున్నారు. ఇంటి అనుమతుల విషయంలో ఇప్పటికే జీహెచ్‌ఎంసీతో వివాదం జరిగింది. ఇంటి నిర్మాణం సందర్భంగా నీటి సరఫరా బంద్‌ చేయాలని కోరడంతో జలమండలి అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఇంటి నిర్మాణ స్థలంలో ఉన్న బోరు నీటినే ఇంటి అవసరాలకు వినియోగిస్తు న్నారు.

ఇంటి నిర్మాణం వల్ల బంజారా హిల్స్‌లోని రోడ్‌ నెం. 24లో చంద్రబాబు అద్దెకు ఉన్నారు. దాంతో అక్కడకు రోజూ మూడు ట్యాంకర్ల నీళ్లను జలమండలి సరఫరా చేసింది. నెలకు సుమారు 4.50 లక్షల లీటర్ల నీళ్లను సరఫరా చేశారు. ప్రస్తుతం ఇంటిని ఖాళీ చేయగా నీళ్లను పూర్తిగా నిలిపివేశారు. క్యాంప్‌ ఆఫీసుకు 2.31 లక్షల లీటర్ల నీళ్ళు సరఫరా ఏపీ సీఎం చంద్రబాబుకు క్యాంప్‌ ఆఫీసును నగరంలోని లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌ను కేటాయించారు. ఈ క్యాంప్‌ ఆఫీసుకు రెండు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 25 ఎంఎం సైజ్‌ పైపు కనెక్షన్‌ ద్వారా నెలకు 1.66 లక్షల లీటర్ల నీళ్లను సరఫరా చేస్తుండగా, 20 ఎంఎం సైజ్‌ పైపు కనెక్షన్‌ ద్వారా నెలకు 65 వేల లీటర్ల నీళ్లను సరఫరా చేస్తున్నారు.

మొత్తం మీద ఏపీ సీఎం క్యాంప్‌ ఆఫీసుకు 2.31 లక్షల లీటర్ల నీళ్లను జలమండలి సరఫరా చేస్తోంది. ఏపీ రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు కొనసాగినప్పటి నుంచి కార్యక్రమాలన్నీ విజయవాడలోని క్యాంప్‌ ఆఫీసు నుంచే నిర్వర్తిస్తున్నారు. అయితే ఒక కుటుంబానికి నెలకు 15 వేల లీటర్ల నీళ్లు సరిపోతాయని జలమండలి అధికారులు చెబుతున్నారు. అయితే, వీఐపీల ఇండ్లకు ఇంత పెద్ద ఎత్తున నీళ్లను సరఫరా చేయడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాల మధ్యే కాదు, ఇళ్ళ మధ్య కూడా నీటి వివాదాలే మరి.

English summary

Water connection was stopped to Ap cm Chandra Babu Naidu. Water connection and power connection was stopped to Ap cm Chandra Babu Naidu home.