పెదవులమీద ముడతలను తొలగించటానికి మార్గాలు

Ways to get rid of wrinkles on lips

03:06 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Ways to get rid of wrinkles on lips

పెదవులు అనేవి ఒకరి వ్యక్తిత్వ వర్ణనలలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మృదువైన మరియు శుభ్రమైన పెదవులు ముఖం యొక్క అందాన్ని పెంచుతాయి. పెదవుల మీద మరియు పెదవుల చుట్టూ ఉన్న చర్మం చాలా సన్నగా మరియు సున్నితంగా ఉంటుంది. పెదవులు సూర్యుడు, గాలి వంటి బాహ్య కారకాలు మరియు లిప్ బామ్, లిప్ స్టిక్ లలో ఉండే హానికరమైన రసాయనాల ద్వారా చాలా సులభంగా ప్రభావితం అవుతాయి.

1/7 Pages

పెదవులమీద ముడుతలను తొలగించటానికి మార్గాలు

* పెదవుల మీద ముడతలను తొలగించుకోవటానికి అనేక కాస్మెటిక్స్ పద్దతులు ఉన్నాయి. పెదవుల మీద గీతలను సరైన ఆహారం మరియు క్రమం తప్పని వ్యాయామంతో తప్పించుకోవచ్చు.

* పెదవుల మీద కొన్ని పదార్దాలను ఇంజెక్ట్ చేసి సన్నగా మరియు అందంగా కనిపించేలా చేస్తారు.

* పెదవులకు  తాజా లుక్ ఇవ్వటానికి మరియు కొత్త కణజాలం నిర్మాణములో సహాయం చేయటానికి లేజర్ చికిత్సలు చేస్తారు.

* పెదవికి టోన్ మరియు ఒక ఆకారాన్ని తీసుకురావటానికి వ్యాయామాలు సహాయపడతాయి. ఐసోమెట్రిక్ వ్యాయామాలు అనేవి పెదవుల ముడతలను తగ్గించటానికి సహాయం చేస్తాయి. ఎగువ మరియు దిగువ దంతాల మధ్య 2 అంగుళాలు ఖాళీతో నోరు తెరవాలి. అద్దంలో పరిశీలన చేసి మరియు దంతాలను కలపకుండా  పై పెదవి,కింద
పెదవిని  కలపాలి. మరల ప్రారంభ స్థితికి రావాలి. ఈ విధంగా 5 నుంచి 6 సార్లు చేయాలి.

* ఫేషియల్ యోగా వ్యాయామాలు పెదవుల ముడతలు మరియు గీతలను తగ్గించటంలో బాగా సహాయపడతాయి. చూపుడు వేలు తో నోటి మూలలను నొక్కాలి. ఎగువ దంతాల మీద  ఎగువ పెదవులను ఉంచి స్ట్రెచింగ్ చేయాలి. ఎగువ పెదవిని 5 అంకెలు లేక్కపెట్టేవరకు అలా ఉంచాలి. ఈ విధంగా మూడు సార్లు చేయాలి. దీనిని క్రమంగా 10 అంకెలు లేక్కపెట్టేవరకు పెంచాలి.

English summary

There are several cosmetics and method of getting rid of wrinkles on the lips. These lines can be avoiding over exposure to sun, proper diet and regular exercise.